ఫీడర్ కెనాల్‌లో ఇద్దరు గల్లంతు
ABN , Publish Date - Sep 06 , 2026 | 06:07 AM
స్నేహితులతో కలిసి సరదాగా కెనాల్‌లో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కటకానిపల్లె గ్రామ సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
రేపు పెళ్లి.. స్నేహితులతో పార్టీ.. అనంతరం కాలువలోకి దిగిన ముగ్గురు
ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన పెళ్లికుమారుడు సహా మరొకరు
ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
పెద్దదోర్నాల, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): స్నేహితులతో కలిసి సరదాగా కెనాల్‌లో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కటకానిపల్లె గ్రామ సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కటకానిపల్లెకి చెందిన పుప్పాల రాజ్‌కుమార్‌కు ఈ నెల 7న వివాహం జరగాల్సి ఉంది. ఈక్రమంలో స్నేహితులు, బంధువులైన ఏడుగురితో కలిసి శనివారం మధ్యాహ్నం గ్రామానికి దగ్గరలోని ఫీడర్ కెనాల్ వద్ద పార్టీ చేసుకున్నారు. అనంతరం రాజ్‌కుమార్, వినయ్‌కుమార్, రాజు సరదాగా ఈత కొడదామంటూ నీటిలో దిగారు. ప్రవాహ వేగానికి రాజ్‌కుమార్(23), వినయ్‌కుమార్(22) కొట్టుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన రాజు అప్రమత్తమై ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎర్రగొండపాలెం సీఐ అజయ్‌కుమార్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ వార్తలను కూడా చదవండి
సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగేనా...?