Share News

ఉపాధ్యాయుల సేవలు అమూల్యం

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:42 PM

విద్యార్థులను మేలుకొల్పుతూ వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అమూల్యమని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.

ఉపాధ్యాయుల సేవలు అమూల్యం

ఎంపీ బస్తిపాటి నాగరాజు

ఘనంగా గురు పూజోత్సవం

48 మందికి పురస్కారాలు అందజేత

కర్నూలు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను మేలుకొల్పుతూ వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అమూల్యమని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. శనివారం డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవం సందర్బంగా కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పాఠశాల, ఇంటర్‌ విద్యాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపకుల పురస్కారాల కార్యక్రమంలో ఎంపీతో పాటు కలెక్టర్‌ ఏ.సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తాను కూడా ఎంఎ్‌ససీ పూర్తిచేశాక కాంట్రాక్టు లెక్చరర్‌గా ఉపాధ్యాయ వృత్తితోనే తన ప్రస్థానం ప్రారంభించానన్నారు. 36 మంది టీచర్లకు, 12 మంది అధ్యాపకులను మొత్తం 48 మందికి జిల్లా స్థాయి పురస్కారాలు అందజేశారు. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పార్వతమ్మ, డీఈవో సుధాకర్‌, ఎస్‌ఎ్‌సఏ ఏపీసీ డా.లోక్‌రాజ్‌, ఆర్‌ఐవో జి.లాలెప్ప, డిప్యూటీ డీఈవో శ్రీధర్‌బాబు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో..: కలెక్టర్‌ సిరి

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కీలకం అని కలెక్టర్‌ ఏ.సిరి పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఆమె అభినందనలు తెలిపారు.

భావిపౌరులుగా తీర్చిదిద్దే శిల్పులు - ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పాణ్యం

ఉపాధ్యాయులు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే శిల్పులు అని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. పాఠ్యాంశ బోధనాలతో పాటు మానవీయ విలువలు, నైతికత క్రమశిక్షణ వంటి అంశాలను కూడా ఉపాధ్యాయులు బోధించాలని సూచించారు.

Updated Date - Sep 05 , 2026 | 11:42 PM