సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగేనా...?
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:59 PM
సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాల్లో గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా బాధ్యతలు నిర్వహించిన ఏఐటీయూసీ కాలపరిమితి ఈ నెలాఖరుతో ము గియనుంది.
-ఈ నెలాఖరుతో ముగియనున్న కాలపరిమితి
-గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న సంఘాలు
-ఎన్నికల నిర్వహణకు జాతీయ సంఘాల పట్టు
-తమకూ నాలుగేళ్లు ఇవ్వాలంటున్న ఏఐటీయూసీ
మంచిర్యాల, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాల్లో గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా బాధ్యతలు నిర్వహించిన ఏఐటీయూసీ కాలపరిమితి ఈ నెలాఖరుతో ము గియనుంది. దీంతో యాజమాన్యం, కేంద్ర కార్మికశాఖలు ఎన్నికలకు వెళ్తాయనే ప్రచా రం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉండటంతో కోల్‌బెల్ట్ ఏరి యాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో మరింత పట్టు సాధించేందుకు తన అనుబంధ యూనియన్ ఐఎన్టీయూసీని ఇప్పటి నుంచే సంసిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సింగరేణి సంస్థలో 1990 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రా రంభం కాగా ప్రతి రెండేళ్ల కోసారి ఎన్నికల నిర్వహణ జరిగేది. 1998, 2000 సంవ త్సరాల వరకు జరిగిన ఎన్నికలకు కూడా కాల పరిమితి రెండు సంవత్సరాలే ఉండేది. 2003లో తొలిసారిగా గుర్తింపు సంఘం కాల పరిమితి నాలుగు సంవత్సరాలకు పెం చగా 2017 వరకు కూడా అదే పద్ధతిలో ఎన్నికల నిర్వహణ సాగింది. అయితే 2017 అక్టోబర్ 5న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాల పరిమితి తిరిగి రెండు సంవ త్సరాలకు కుదించారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ కాలపరిమితి త్వరలో ముగుస్తుండగా, దాన్ని గతంలో మాదిరిగా నా లుగేళ్లకు పెంచుతారా...? లేక రెండేళ్లతోనే సరిపెడతారా...? అన్న చర్చ కార్మికుల మధ్య జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా...? అన్న చర్చ కూడా జరుగుతోంది.
ప్రభుత్వ రంగ సంస్థలకు ఎన్నికలు అనివార్యం....
ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా నిరంతరాయంగా ఎన్నికల ప్రక్రియను చేపడితేనే సంస్థతోపాటు అందులో పనిచేసే కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది. సమస్యల పరిష్కారానికి ఎన్నికలు ఒక వేధికగా నిలుస్తాయి. ప్రభుత్వాలు, యాజమాన్యాలు బా ధ్యతగా క్రమం తప్పకుండా ఎన్నికల నిర్వహణ ఎలాంటి ఆటంకాలు కలుగుకుండా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. సింగరేణిలోని ఐదు జాతీయ కార్మిక సంఘాలైన ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్‌తోపాటు ప్రాంతీయ సంఘాలు కూడా ఎన్నికల నిర్వహణకు పట్టుబడుతుండగా గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ అనివార్యం కానుంది. ఆయా సంఘాల ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మికశాఖ అధికారులతోపాటు సింగరేణి యాజమాన్యానికి ఇప్పటికే వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ కూడా ఎన్నికల కోసం డిమాండ్ చేయడం పట్ల ఏఐటీయూసీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీబీజీకేఎస్ అధికారం లో ఉన్నప్పుడు ఒక దఫా ఆరేళ్లు, మరో దఫా నాలుగేళ్లు ఏకదాటిగా గుర్తింపు సంఘంగా ప్రాతినిథ్యం వహించింది. ప్రస్తుతం ఆ సంఘం నాయకులు ఎన్నికలకు డిమాండ్ చేస్తుండటంతో తమకో న్యాయం, ఇతరులకు మరోటా...? అని ఏఐటీయూసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న యూనియన్లు...
ప్రస్తుత గుర్తింపు సంఘం కాలపరిమితి ముగుస్తుండటంతో రంగంలో నిలిచే సింగరేణి జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్, టీబీజీకేఎస్, సీఐటీయూ, బీఎంఎస్ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించాయి. అయితే గుర్తింపు సంఘంగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఏఐటీయూసీ మాత్రం ఇప్పుడే ఎన్నికలకు వెళ్లకుం డా తన పదవీ కాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగించాలని పట్టుబడుతోంది. కోల్‌బెల్ట్ ప్రాంతంలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపెల్లి, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లో విస్త రించిన సింగరేణి ఎన్నికల నిర్వహణ కోసం జాతీయ సంఘాలైన అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీతో సహా ఇతర యూనియన్లు పట్టుబ డుతున్నాయి. సింగరేణి గుర్తింపు ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ హెచ్‌ఎంఎస్ కోర్టును ఆశ్రయించడంతో తీర్పు కోసం ఆయా సంఘాల ప్రతినిధులు వేచి చూస్తున్నారు.
ఎన్నికలు నిర్వహించాలి...ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్
సింగరేణిలో ప్రస్తుత గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున ఎన్నికలు నిర్వహించాలని సంస్థ యాజమాన్యానికి, కేంధ్ర కార్మికశాఖకు ఇప్పటికే వినతి పత్రాలు అందజేశాము. అయితే ఎన్నికల అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు కోసం వేచి చూస్తున్నాం. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైతే ప్రభుత్వంపైనా ఒత్తిడి తెచ్చేం దుకు సిద్ధంగా ఉన్నాం. ఐఎన్టీయూసీ ఎన్నికలకు పూర్తి సన్నద్దంగా ఉంది.
గడువు పొడిగించాలి...ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
గతంలో గుర్తింపు సంఘంగా ప్రాతినిథ్యం వహించిన టీబీజీకేఎస్‌కు రెండు దఫాలు గా కనీసం నాలుగేళ్ల కాలపరిమితి ఇచ్చారు. ప్రస్తుతం మేము గుర్తింపు సంఘంగా ఉన్నందున ఇతర సంఘాల నాయకులు రెండేళ్లకే పరిమితం చేయాలంటున్నారు. ఇది సమంజసం కాదు. మాకు కూడా నాలుగేళ్లు అవకాశం ఇవ్వాలి. మరోవైపు రెండేళ్ల కోసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల సింగరేణి సంస్థపైనా అదనపు భారం పడుతుంది.