Share News

AP Caravan Tourism: సంక్రాంతి వేళ కారవాన్ టూరిజం ప్యాకేజీలు.. రెచ్చిపోండిక.!

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:47 PM

సినిమా హీరోలు, వీవీఐపీలు మాత్రమే వాడే కారవాన్‌లు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు, ఇందులో షికారు చేస్తూ అద్భుతమైన టూరిజం అనుభూతిని ఆస్వాదించే అవకాశం కూడా కల్పిస్తోంది ఏపీ పర్యాటక శాఖ. కారవాన్‌ను ఎలా బుక్ చేసుకోవాలి? రూట్లు.. వాటి రేట్లు..

AP Caravan Tourism: సంక్రాంతి వేళ కారవాన్ టూరిజం ప్యాకేజీలు.. రెచ్చిపోండిక.!
AP Caravan Tourism

ఆంధ్రజ్యోతి, జనవరి 5: ఏపీలో టూరిజంను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం పర్యాటక శాఖ ఎన్నో విప్లవాత్మక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఒకప్పుడు సినీ హీరోలు, వీఐపీలకు మాత్రమే ఉండే కారవాన్‌లను ప్రభుత్వం ఏపీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఈ కారవాన్‌ టూరిజం ద్వారా పర్యాటక ప్రేమికులకు ప్రకృతి అందాలు, సుప్రసిద్ధమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు ఎన్నో పేరుగాంచిన క్షేత్రాలను వీక్షించే సౌకర్యం కల్పిస్తోంది. సంక్రాంతి సెలవులు నేపథ్యంలో 4 ఎంపిక చేసిన మార్గాల్లో ఈ టూరిజం ప్యాకేజీలను తాజాగా ఏపీ టీడీసీ ప్రకటించింది.


ఈ కారవాన్‌లను ప్రయోగాత్మకంగా ఏపీ టూరిజం శాఖ తొలుత 4 మార్గాల్లో నడపాలని నిర్ణయించింది. ఈ కారవాన్ టూరిజంను ఎంజాయ్ చేయాలనుకునే వారు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) పోర్టల్‌ ద్వారా సులభంగా టికెట్లు పొందే వెసులుబాటు కల్పిస్తోంది. అంతేకాదు, మొత్తం వాహనాన్ని బుక్ చేసుకునే వెసులుబాటును సైతం కల్పిస్తోంది.

కారవాన్‌లు తిరిగే ప్రాంతాలు:

1. విశాఖపట్నం-అరకు, లంబసింగి (ఒకటిన్నర రోజు) ధర: రూ. 42,500 (10-12 సీట్ల కారవాన్‌), రూ. 31,500 (5-6 సీట్లు)

2. విశాఖపట్నం నుంచి సింహాచలం, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం మీదుగా వాడపల్లి (ఒకటిన్నర రోజు).. ధర: రూ. 42,500 (10-12 సీట్లు), రూ. 31,500 (5-6 సీట్లు)

3. హైదరాబాద్‌-సూర్యలంక (రెండు రోజులు).. ధర: రూ.85,000 (10-12 సీట్లు), రూ.64,000 (5-6 సీట్లు)

4. హైదరాబాద్‌-గండికోట (రెండు రోజులు).. ధర: రూ.85,000 (10-12 సీట్లు), రూ.64,000 (5-6 సీట్లు)


సంక్రాంతికి హైదరాబాద్ టు భీమవరం ఆరు రోజుల స్పెషల్ ప్యాకేజ్ రూ. 3.50 లక్షలు

సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్‌ నుంచి భీమవరం, దిండి వరకు ప్రత్యేకంగా 6 రోజుల ప్యాకేజీతో కారవాన్‌ నడపాలని కూడా ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్యాకేజీలను సైతం ప్రకటించింది. 6 రోజుల ప్యాకేజీకి రూ.3.50 లక్షలుగా ధరను నిర్ధారించింది.

కారవాన్‌లను ఈనెల 10, 11, 12 తేదీలకు బుక్‌ చేసుకోవచ్చు. ఆ రోజు నుంచి 6 రోజుల పాటు ప్యాకేజీ అమలులో ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు

తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 05:55 PM