Share News

మున్సిపల్ ఎన్నికల టీడీపీ మూడో జాబితా విడుదల.. గుంటూరు, ఒంగోలు మేయర్లు ఖరారు

ABN , Publish Date - Oct 17 , 2026 | 09:21 PM

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ మూడో జాబితా విడుదల. గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, ఒంగోలు మేయర్‌గా నల్లమిల్లి శ్రీశిల్పతో పాటు 10 చైర్మన్లు ఖరారు. మొత్తం 10 మేయర్లు, 60 చైర్మన్ల ఎంపిక పూర్తి.

మున్సిపల్ ఎన్నికల టీడీపీ మూడో జాబితా విడుదల..  గుంటూరు, ఒంగోలు మేయర్లు ఖరారు
TDP Releases Third List for Municipal Elections

TDP municipal third list: ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 12 మంది అభ్యర్థులతో కూడిన మూడవ జాబితాను టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ మూడో జాబితాలో 2 మేయర్ స్థానాలు, 10 మున్సిపల్ చైర్మన్ల స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను పార్టీ నాయకత్వం ఖరారు చేసింది.

గుంటూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పేరును ఖరారు చేశారు. ఒంగోలు కార్పొరేషన్ మేయర్ బరిలో నల్లమిల్లి శ్రీశిల్ప నిలవనున్నారు. ఈ జాబితాలో మరో 10 పురపాలక సంఘాలకు (మున్సిపాలిటీలకు) చైర్మన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

మొత్తం మేయర్ అభ్యర్థులు: 10 మంది (విశాఖ, కడప, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం, చిత్తూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు).

మొత్తం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు: 60 మంది. దీంతో టీడీపీ ప్రధాన స్థానాలన్నింటికీ అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది.

TDP 3rd List.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Oct 17 , 2026 | 09:43 PM