Share News

నైతికత లేని నాయకుడు జగన్‌: వర్ల

ABN , Publish Date - Sep 26 , 2026 | 06:15 AM

రాజకీయాల్లో నైతికత, జవాబుదారీతనం ఎంతో ముఖ్యమని, ఆ రెండూ లేని నాయకుడు జగన్‌ అని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

నైతికత లేని నాయకుడు జగన్‌: వర్ల

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో నైతికత, జవాబుదారీతనం ఎంతో ముఖ్యమని, ఆ రెండూ లేని నాయకుడు జగన్‌ అని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ఐదేళ్ల పాలనలో జగన్‌ అన్ని వ్యవస్థల్లో అవినీతి ద్వారాలు పూర్తిగా ఎత్తి రాష్ట్రమంతా అవినీతిమయం చేశారని అన్నారు. లిక్కర్‌ స్కాంలో అప్రూవర్‌గా మారిన ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఓఎస్డీ వెంకట సత్యప్రసాద్‌ ఆరోపణలపై జగన్‌ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. రూ.3500 కోట్ల మద్యం స్కాంకు మూలవిరాట్‌ జగన్‌రెడ్డేనని స్పష్టమైపోయిందని చెప్పారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు చేసే ఆరోపణలపై లోకేశ్‌ ఆధారాలతోసహా వివరణ ఇచ్చారని, గ్రూప్‌- 1 అక్రమాలపై జగన్‌ ఎందుకు నోరు విప్పడం లేదని వర్ల ప్రశ్నించారు. జగన్‌ తన రాజకీయ మనుగడ కోసం ఇండియా కూటమి పంచన చేరేందుకు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ కమ్యూనిస్టుల వంక కన్నెత్తి చూడని జగన్‌కు ఇప్పుడు వారే దిక్కయ్యారని ఎద్దేవా చేశారు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 06:15 AM