Share News

అశోక్‌ గజపతితో చిన్న శ్రీను భేటీ

ABN , Publish Date - Sep 14 , 2026 | 05:02 AM

గోవా లోక్‌భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజును ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్న శ్రీను ఇటీవల టీడీపీలో చేరాక తొలిసారి అశోక్‌ను కలిసిన ఆయన విజయనగరం రాజకీయాలపై చర్చించారు.

అశోక్‌ గజపతితో చిన్న శ్రీను భేటీ

విజయనగరం రూరల్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): గోవా లోక్‌భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజును ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్న శ్రీను ఇటీవల టీడీపీలో చేరాక తొలిసారి అశోక్‌ను కలిసిన ఆయన విజయనగరం రాజకీయాలపై చర్చించారు. చిన్న శ్రీను వెంట ఆయన కుమార్తె మజ్జి సిరిసహస్ర, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఉన్నారు. టీడీపీలో కొత్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తాను అశోక్‌ గజపతిరాజు ఆశీస్సులు తీసుకున్నానని చిన్న శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్దల ఆశీస్సులు, సూచనలతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. శ్రీనివాసరావుతో పాటు సిరి సహస్రకు గోవా గవర్నర్‌ ఆశీస్సులు అందించారు.

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 05:02 AM