Share News

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:22 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. రాఘవేంద్రస్వామి దర్శనార్థం లక్షల్లో భక్తులు తరలివచ్చారు.

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీమఠం

సాధారణ దర్శనానికి నాలుగు గంటల సమయం

మూల బృందావనానికి ప్రత్యేక పూజలు

ప్రత్యేక క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు

మంత్రాలయం, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. రాఘవేంద్రస్వామి దర్శనార్థం లక్షల్లో భక్తులు తరలివచ్చారు. వరుస సెలవు దినాలు కావడంతో ఆం ధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరాగా రద్దీ నెలకొంది. భక్తులతో అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వ మార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నది తీరం సందడిగా మారింది. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేకలు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సీఐ రామాంజులు, ఎస్‌ఐ శివాంజల్‌, పోలీసులు, సెక్యూరిటీ ఆధ్వ ర్యంలో శ్రీమఠం ప్రాంగణంలో క్యూలైన్లు అదనంగా ఏర్పాటుచేశారు. ప్రసాదాల కొరత రాకుండా మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, ప్రత్యేకకౌంటర్లు ఏర్పాటుచేశారు. భక్తులు పోటెత్త డంతో సాధారణ దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. దర్శనం చేసుకున్న భక్తులను బయటకు పంపిస్తూ ఎప్పటికప్పుడు మేనేజరు ఎస్‌కే శ్రీనివాసరావు జాగ్రత్తలు తీసుకున్నారు. దర్శనం చేసుకున్న భక్తులను ప్రాకారం నుంచి బయటికి వెళ్లాలని సిబ్బంది మైకులతో సూచించారు.

Updated Date - Jun 09 , 2025 | 12:22 AM