Share News

ఆందోళనలను ఉధృతం చేస్తాం

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:30 PM

హైకో ర్టు బెంచ్‌ కోసం న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, భవిష్యత్తులో ఆం దోళనను ఉధృతం చేస్తామని కర్నూలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రుడు అన్నారు.

ఆందోళనలను ఉధృతం చేస్తాం
దీక్షలో పాల్గొన్న న్యాయవాదులు

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రుడు

కర్నూలు లీగల్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): హైకో ర్టు బెంచ్‌ కోసం న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, భవిష్యత్తులో ఆం దోళనను ఉధృతం చేస్తామని కర్నూలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రుడు అన్నారు. హైకోర్టు బెంచ్‌ను ఏర్పా టు చేయాలంటూ న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం 21వ రోజుకు చేరుకున్నాయి. ఈదీక్షలో న్యాయవాదులు షేక్‌ షఫి, టిప్పు సుల్తాన్‌, అబ్దుల్‌ అజీజ్‌, సుఫైయా మెహఫూజ్‌, హబీబుల్లా, సుమంత్‌, నవీన్‌ పాల్గొన్నారు.

న్యాయవాదులు దీక్షలు కొనసాగిస్తున్న నేపథ్యంలో తమ భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించడానికి మంగళవా రం సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో మెజారిటీ న్యాయవాదులు తీసుకున్న నిర్ణయం మేరకు తమ భవిష్యత్‌ కార్యచరణ ఉంటుందని పేర్కొన్నారు. న్యాయవాదులు హాజరై తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు.

Updated Date - Sep 13 , 2026 | 11:30 PM