Share News

టీడీపీకి 7 డిప్యూటీ మేయర్లు

ABN , Publish Date - Nov 23 , 2026 | 04:03 AM

రాష్ట్రంలోని 13 కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో కూటమి పార్టీల నడుమ సర్దుబాటు కొలిక్కి వచ్చింది.

టీడీపీకి 7 డిప్యూటీ మేయర్లు
CM Chandrababu Naidu

  • 59 వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులు కూడా.. జనసేనకు 23, బీజేపీకి 9

  • టీడీపీ జాబితాను ప్రకటించిన చంద్రబాబు

అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 13 కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో కూటమి పార్టీల నడుమ సర్దుబాటు కొలిక్కి వచ్చింది. 100 పట్టణ సంస్థల్లో టీడీపీ 66, జనసేన 23, బీజేపీ 9 స్థానాల్లో పోటీచేయనున్నాయి. సోమవారం జరిగే ఈ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం రాత్రి ప్రకటించారు. టి.స్వాతి (అనంతపురం), ఎ.గోపీనాథ్‌ (చిత్తూరు), పృథ్వీ శారద (ఏలూరు), మన్సూర్‌ ఆలీఖాన్‌ (కడప), చావలి చర్పిత (ఒంగోలు), చెన్నుపాటి క్రాంతిశ్రీ (విజయవాడ), ప్రసాదుల రజని (విజయనగరం)ని ఎంపిక చేశారు. అలాగే 59 మున్సిపాలిటీలు.. అద్దంకి, ఆదోని, ఆళ్లగడ్డ, అమలాపురం, ఆత్మకూరు, బద్వేలు, చిలకలూరిపేట, చీమకుర్తి, చీరాల, దర్శి, డోన్‌, గిద్దలూరు, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, ఇచ్ఛాపురం, జమ్మలమడుగు, కదిరి, కల్యాణదుర్గం, కనిగిరి, కుప్పం, మాచర్ల, నగరి, నంద్యాల, నరసాపురం, నిడదవోలు, నూజివీడు, పెడన, పెద్దాపురం, పెనుకొండ, పిడుగురాళ్ల, ప్రొద్దుటూరు, పులివెందుల, పుంగనూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజంపేట, రాయచోటి, సాలూరు, సామర్లకోట, సూళ్లూరుపేట, తాడిపత్రి, తెనాలి, తిరువూరు, తుని, వెంకటగిరి, వినుకొండ, యలమంచిలి, ఏలేశ్వరం, ఎమ్మిగనూరు, ఎర్రగుంట్ల, దాచేపల్లి, గూడూరు, గురజాల, కమలాపురం, మడకశిర, ముమ్మిడివరం, నెల్లిమర్ల, పాలకొండ స్థానాల్లో టీడీపీ తరఫున వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులు బరిలోకి దిగనున్నట్లు సీఎం వెల్లడించారు.


జనసేన డిప్యూటీ మేయర్‌/

వైస్‌చైర్‌పర్సన్‌ అభ్యర్థులు వీరే..

తన వాటాగా వచ్చిన నాలుగు కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్‌, 19 మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ పదవులకు జనసేన ఆదివారం రాత్రి పొద్దుపోయాక అభ్యర్థులను ప్రకటించింది. వారు.. పందిరి వెంకట శివప్రసాద్‌ (విశాఖపట్నం), యర్రంశెట్టి రాజేశ్‌ (గుంటూరు), కొట్టె వెంకట్రావు (మచిలీపట్నం), తిరుపతి(పాలడుగు విజయ).. వాడరేవు అశోక్‌ (పలాస-కాశీబుగ్గ), అద్దేపల్లి సౌజన్య (నర్సీపట్నం), బొజ్జా వెంకటేశ్వరరావు (పిఠాపురం), ఎన్నేటి అప్పారావు (గొల్లప్రోలు), కె.నారాయణమూర్తి (రామచంద్రాపురం), తోట శ్రీనివాసరావు (ఆకివీడు), బి.నరేశ్‌కుమార్‌ (జంగారెడ్డిగూడెం), గంటా గంగాభవాని (ఉయ్యూరు), కొలగాని రాము (జగ్గయ్యపేట), అక్కల రామ్మోహనరావు (కొండపల్లి), వడ్డి నాగమారుతీకుమారి (రేపల్లె), మామిడి దివ్యవాణి (సత్తెనపల్లి), కొప్పుల నాగజ్యోతి (మార్కాపురం), కె.శిరీష (ఆత్మకూరు-ఎన్‌), మహబూబ్‌ బాషా (రాయదుర్గం), సయ్యద్‌ మురాధు (పలమనేరు), వి.శాంతకుమారి (మైదుకూరు), యంగలశెట్టి విజయలక్ష్మి (ధర్మవరం), రాజేటి సునీత (బొబ్బిలి).బీజేపీకి ఇవీ..

బీజేపీ రెండు కార్పొరేషన్లు.. కర్నూలు, నెల్లూరు డిప్యూటీ మేయర్‌ పదవులకు, ఏడు మున్సిపాలిటీలు.. పార్వతీపురం, మండపేట, కొవ్వూరు, నందిగామ, బుచ్చిరెడ్డిపాలెం, మదనపల్లె, నాయుడుపేట వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు పోటీచేయనుంది

ఇవి కూడా చదవండి..

ఎమ్మెల్యే అసభ్య మెసేజీలు పెట్టినట్టు ఆరోపణ.. మద్రాస్ హైకోర్టు సీరియస్

ఈఎంఐల కోసం వేధించొద్దు!

Updated Date - Nov 23 , 2026 | 04:03 AM