బీసీలకు అందలం!
ABN , Publish Date - Oct 18 , 2026 | 03:46 AM
పట్టణ స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రకటనలో టీడీపీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. బీసీలకు ఏకంగా 36శాతం సీట్లను కేటాయించింది.. 25 స్థానాల్లో బీసీలను పోటీకి దించింది.
25 స్థానాల్లో బరిలోకి.. 36 శాతం సీట్లు వారికే .. 70 స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ఖరారు
10 మేయర్, 60 చైర్పర్సన్ అభ్యర్థుల ప్రకటన.. 10 స్థానాల్లో మైనార్టీలు... తొమ్మిది చోట్ల ఎస్సీలు
ఒకచోట ఎస్టీ అభ్యర్థి.. మహిళలకు 61 శాతం సీట్లు.. యువతకూ ప్రాధాన్యం
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రకటనలో టీడీపీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. బీసీలకు ఏకంగా 36శాతం సీట్లను కేటాయించింది.. 25 స్థానాల్లో బీసీలను పోటీకి దించింది. అదేవిధంగా ఓసీలు 25 (రెడ్డి సామాజికవర్గం-9, కమ్మ సామాజిక వర్గం-8, మిగిలిన ఓసీ కులాలు-8) చోట్ల పోటీచేస్తున్నారు. మైనార్టీలకు 10, ఎస్సీలకు 9, ఎస్టీలకు ఒకటి చొప్పున కేటాయించారు. అభ్యర్థుల పేర్లతో శుక్రవారం తొలి జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు శనివారం రెండు విడతలుగా జాబితాలు విడుదల చేశారు. మొత్తం కలిపి ఇప్పటివరకూ 10 కార్పొరేషన్లకు మేయర్లు, 60 మున్సిపాల్టీలకు ఛైర్పర్సన్ అభ్యర్థులను ఖరారు చేశారు. పొత్తుల్లో భాగంగా టీడీపీ మొత్తం 11 కార్పొరేషన్లు తీసుకోగా వాటిలో మంగళగిరి-తాడేపల్లికి ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. అలాగే టీడీపీ పోటీ చేస్తున్న 78 మున్సిపాలిటీల్లో 14 చోట్ల ఎన్నికలు జరగడం లేదు.
యువత, మహిళలకు పెద్దపీట
మొత్తం స్థానాల్లో 61శాతం సీట్లను మహిళలకు కేటాయించడం ద్వారా మహిళాసాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందని నిరూపించారు. చట్టబద్ధంగా మహిళలకు దక్కే 50శాతం సీట్ల కన్నా ఇది చాలా ఎక్కువ. జనరల్ స్థానాల్లోనూ మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. ఈసారి టికెట్ల కేటాయింపులో యువతకూ టీడీపీ ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం అభ్యర్థుల్లో 20 మంది 40 ఏళ్లలోపు వారే. 11 మంది 35 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసువారు. రాజంపేట అభ్యర్థి డాక్టర్ దొంతం గాయత్రి(26) టీడీపీ అభ్యర్థుల్లో అత్యంత పిన్నవయస్కురాలు. మొత్తం అభ్యర్థుల్లో 42 మంది పట్టభద్రులు ఉన్నారు. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏ చదివిన వారు కూడా ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఈసారి స్థానిక ప్రజల అభిప్రాయానికి టీడీపీ ప్రాధాన్యం ఇచ్చింది.
కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులు
మచిలీపట్నం- షేక్ అబ్దుల్ అబిదా
గుంటూరు- కోవెలమూడి లక్ష్మీ అపర్ణ
ఒంగోలు- నల్లమల్లి శ్రీశిల్ప
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ