బీసీలను కులం పేరిట దూషిస్తే కఠిన శిక్షలు
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:34 AM
బీసీల ఆత్మగౌరవ జీవనమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత పేర్కొన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో మంత్రి సవిత నేతృత్వంలో బీసీ రక్షణ చట్టంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె సవిత మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తున్నారు.
జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు.. 2 నెలల్లో దర్యాప్తు పూర్తి.. త్వరలో ఆదరణ పథకం అమలు
బీసీల రక్షణ చట్టంపై అవగాహన సదస్సులో మంత్రి సవిత
గొల్లపూడి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): బీసీల ఆత్మగౌరవ జీవనమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత పేర్కొన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో మంత్రి సవిత నేతృత్వంలో బీసీ రక్షణ చట్టంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె సవిత మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా బీసీ రక్షణ చట్టం అమలు చేస్తున్న ఘనత ఏపీదే. బీసీలను కులం, వృత్తుల పేరుతో దూషించినా, సంఘ బహిష్కరణలు చేసినా చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం. జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తాం. 2 నెలల్లో కేసుల దర్యాప్తు పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించాం. బీసీ రక్షణ చట్టాన్ని కోర్టుల్లో నిలబడేలా రూపొందించి, బీసీ రక్షణ చట్టంపై ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయాలు తీసుకున్నాం. ఇప్పుడు 156 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం’ అని తెలిపారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కోల్పోయిన పదవులను బీసీలకు అందజేసేలా కృషి చేస్తామని మంత్రి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించిన జగన్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే విజయమనే భయంతో ఉన్నారని, అందుకే ప్రభుత్వంపై నిత్యం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. కాగా, త్వరలో ఆదరణ పథకం అమలు చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు. సదస్సులో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, పలు బీసీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం
‘బీసీల ఆత్మగౌరవం పెంచేలా సీఎం చంద్రబాబు పరిపాలన సాగుతోంది. కూటమి నాయకులు, కార్యకర్తలు గర్వంతో తలెత్తుకుని తిరుగుతున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మనదే విజయం’ అని మంత్రి ఎస్.సవిత అన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లతో శనివారం బీసీ రక్షణ చట్టంపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ‘బీసీలంటేనే టీడీపీ. గత ఎన్నికల ముందు మంత్రి లోకేశ్ నిర్వహించిన పాదయాత్రలో బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ బీసీ రక్షణ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. కోర్టులో బలంగా నిలబడేలా ఈ చట్టానికి తుదిమెరుగులు దిద్దుతున్నాం. దీనిలో భాగంగా మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశాలు నిర్వహించాం. 156 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి సవిత అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకటగురుమూర్తి, నందం అబద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి