Share News

స్థానిక సంస్థల ఎన్నికలకు షర్మిల కసరత్తు.. మానిటరింగ్ కమిటీ ఏర్పాటు

ABN , Publish Date - Sep 11 , 2026 | 10:19 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డిని కమిటీ చైర్మన్‌గా నియమించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు షర్మిల కసరత్తు.. మానిటరింగ్ కమిటీ ఏర్పాటు

విజయవాడ, సెప్టెంబర్ 11: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 8 మందితో కూడిన రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డిని నియమించారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేలా మానిటరింగ్ కమిటీకి షర్మిలా దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా.. స్థానిక ఎన్నికల్లో విధివిధానాలు, అభ్యర్థుల ఎంపిక ఇతర అంశాలకు మానిటరింగ్ కమిటీ బాధ్యత వహిస్తుందని ఆమె తెలిపారు. ఈ దృష్ట్యా జిల్లా, నగర అధ్యక్షులు మానిటరింగ్ కమిటీతో సమన్వయం కావాలని షర్మిలా ఆదేశాలు జారీ చేశారు.


కాగా, మానిటరింగ్ కమిటీ సభ్యులను నియమిస్తూ షర్మిలా ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ కన్వీనర్‌గా మాజీ కేంద్రమంత్రి, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలాన్ని నియమించారు. సీడబ్య్లూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు,

మాజీ కేంద్ర మంత్రులు పల్లం రాజు, కిల్లి కృపారాణి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, మాజీ రాజ్యసభ ఎంపీ, ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డిలను మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నియమించారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియా, ఎన్నికల కో ఆర్డినేషన్ ఇన్‌చార్జిగా అధికార ప్రతినిధి, నెల్లూరు డీసీసీ కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైళ్లన్నీ కిటకిట.. వరుస సెలవులతో సొంతూరు బాటపట్టిన జనం

మెగా డీఎస్సీపై జగన్ విషం కక్కడం బాధాకరం: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana New

Updated Date - Sep 11 , 2026 | 11:13 AM