కొండలరాయుడికి నైవేద్యంగా తేళ్లు
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:20 AM
దేవుళ్లకు పళ్లు, పిండి వంటలు నైవేద్యంగా సమర్పించడం చూస్తుంటాం.. అయితే అక్కడ మాత్రం తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో వింత ఆచారం
కోడుమూరు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): దేవుళ్లకు పళ్లు, పిండి వంటలు నైవేద్యంగా సమర్పించడం చూస్తుంటాం.. అయితే అక్కడ మాత్రం తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. కొండలరాయుడు కొలువైన ఆ కొండపై ఏ రాయిని కదిపినా తేళ్లు కనిపిస్తుంటాయి. భక్తులు ఆ తేళ్లను పట్టుకొని చేతులపై, నాలుక, తలపై పెట్టుకొని ఆ తర్వాత స్వామికి సమర్పిస్తారు. ఈ వింత ఆచారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఏటా శ్రావణమాసం మూడో సోమవారం భక్తులు తేళ్ల పండుగను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో కొండ్రాయి కొండపై వెలసిన కొండలరాయుడు (వేంకటేశ్వరస్వామి) ఆలయంలో సోమవారం తేళ్ల పండుగను వైభవంగా నిర్వహించారు.
ఈ వార్తలను కూడా చదవండి