కేజీబీవీల్లో బదిలీలకు 235 దరఖాస్తులు
ABN , Publish Date - Sep 01 , 2026 | 02:54 AM
ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది బదిలీలకు 235 దరఖాస్తులు వచ్చాయి. ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలు 199 మంది తప్పనిసరి బదిలీ కావాల్సి ఉండగా 197 మంది దరఖాస్తు చేశారు.
పరిశీలిస్తున్న అధికారులతో కూడిన కమిటీ
ఒంగోలు విద్య, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది బదిలీలకు 235 దరఖాస్తులు వచ్చాయి. ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలు 199 మంది తప్పనిసరి బదిలీ కావాల్సి ఉండగా 197 మంది దరఖాస్తు చేశారు. ఇద్దరు సీఆర్టీ ఇంగ్లీషు టీచర్లు దరఖాస్తు చేయలేదు. ఈ ఇరువురి సర్వీసు రెన్యువల్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా ఎస్పీడీకి తెలియజేస్తామని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ దాసరి అనిల్‌కుమార్ తెలిపారు. దరఖాస్తుల పరిశీలనను ముగ్గురు ఎంఈవోలు, ఇద్దరు కార్యాలయ సిబ్బందితో ఏర్పాటుచేసిన కమిటీ చేపట్టింది.