Share News

9,326 పోలింగ్‌ కేంద్రాలు

ABN , Publish Date - Sep 01 , 2026 | 02:55 AM

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తుది పోలింగ్‌ కేంద్రాలను పంచాయతీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ప్రకాశం జిల్లాలో 519 గ్రామ పంచాయతీల పరిధిలో 5,268, మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీల్లో 4,058 పోలింగ్‌ కేంద్రాలు కలిపి మొత్తం 9.326 ప్రకటించారు.

9,326 పోలింగ్‌ కేంద్రాలు

గ్రామ పంచాయతీల్లో తుది జాబితా ప్రచురణ

రెండు జిల్లాల్లో ప్రకటించిన కార్యదర్శులు

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తుది పోలింగ్‌ కేంద్రాలను పంచాయతీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ప్రకాశం జిల్లాలో 519 గ్రామ పంచాయతీల పరిధిలో 5,268, మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీల్లో 4,058 పోలింగ్‌ కేంద్రాలు కలిపి మొత్తం 9.326 ప్రకటించారు. వారం క్రితం పంచాయతీల్లో ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితాలను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించారు. సోమవారం తుది జాబితాను ప్రకటించారు. రెండు జిల్లాలో 925 గ్రామపంచాయతీలు ఉండగా ప్రకాశం జిల్లాలో 519 ఉన్నాయి. ఒక్క కొండపి మినహా మిగిలిన 518 గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ కేంద్రాలను ప్రకటించారు. కొండపికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలు ఉండగా అన్నిచోట్లా ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - Sep 01 , 2026 | 02:55 AM