‘సంజీవని’తో సకాలంలో వైద్యం
ABN , Publish Date - Sep 17 , 2026 | 04:19 AM
రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో.. ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం(సెప్టెంబరు 17) సందర్భంగా మంత్రి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నేడు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం
రోగి భద్రతకు అధిక ప్రాధాన్యం: మంత్రి సత్యకుమార్
నేటి నుంచి రాష్ట్రంలో ‘సేవా సంకల్ప్ అభియాన్’
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో.. ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం(సెప్టెంబరు 17) సందర్భంగా మంత్రి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యాధిని ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స, మందులు అందించడం, చికిత్స అనంతరం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా రోగి భద్రతను బలోపేతం చేయాలని సూచించారు. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స అందించడం సులభం అవుతుందన్నారు. సంజీవని ద్వారా ప్రతి రోగి ఆరోగ్య వివరాలను డిజిటలీకరణ చేస్తున్నామని, దీంతో ఆరోగ్య భద్రత మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాలు, బోధనాస్పత్రుల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య