రాజమండ్రి జైలుకు సాదిక్‌ఖాన్
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:02 AM
పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు జగదీష్‌రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సాదిక్‌ఖాన్ రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది.
ముగిసిన రెండు రోజుల పోలీసు కస్టడీ
13న కాకినాడ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
సర్పవరం జంక్షన్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు జగదీష్‌రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు షేక్ సాదిక్‌ఖాన్‌ను రెండురోజుల పోలీసు విచారణ అనంతరం శనివారం రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. నిందితుడిని రెండోసారి కస్టడీకి కోరుతూ సర్పవరం పోలీసులు పిటిషన్ వేయగా అక్టోబరు 1, 2 తేదీల్లో సాదిక్‌ను విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణ ముగియడంతో శనివారం కాకినాడ రిజర్వులైన్‌లోని పోలీసు ఆస్పత్రిలో సాదిక్‌ఖాన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టుకి తీసుకెళ్లగా జడ్జి సెలవులో ఉండటంతో కాకినాడ అర్బన్ తహశీల్దార్ వద్ద నిందితుడిని హాజరుపరచి, అక్కడి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకెళ్లి అప్పగించారు. ఈనెల 13న వాయిదా ఉండటంతో ఆ రోజు నిందితుడిని కాకినాడ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, రెండు రోజులపాటు సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో సీహెచ్ ప్రకాశ్ నిందితుడిని విచారించారు. నిందితుడి నుంచి సేకరించిన సమాచారాన్ని, పూర్తి కీలక ఆధారాలు, సాంకేతిక ఆధారాల రిపోర్టును కోర్టుకు సమర్పించేందుకు దర్యాప్తు అధికారి చర్యలు చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి: