Share News

తెగిన రోప్‌.. దిగిపోయిన 9వ గేటు

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:50 AM

రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని అందించే నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ 9వ గేటు ఐరన్‌ రోప్‌ గురువారం రాత్రి తెగిపోయింది.

తెగిన రోప్‌.. దిగిపోయిన 9వ గేటు
Pothireddypadu gate

  • పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌లో ఘటన

  • నేడు మరమ్మతులు చేసి కొత్త రోప్‌

  • మూడో గేటు రోప్‌వీల్స్‌ కూడా ధ్వంసం?

జూపాడుబంగ్లా, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని అందించే నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ 9వ గేటు ఐరన్‌ రోప్‌ గురువారం రాత్రి తెగిపోయింది. దీంతో గేటు భారీ శబ్ధం చేస్తూ కిందికి జారిపోయింది. ఆ సమయంలో అక్కడున్న మత్స్యకారులు భయాందోళనలకు గురై ఒడ్డుకు చేరుకున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో అధికారులు గేటును ఎత్తి నీటిని విడుదల చేసే సమయంలో రోప్‌ తెగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. మూడోగేటు కూడా ఎత్తేందుకు ప్రయత్నించగా దానికున్న రోప్‌వీల్స్‌ కూడా ధ్వంసమైనట్లు సమాచారం. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ఏఈ విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం మరమ్మతులు చేపట్టి కొత్త రోప్‌ వేస్తామని వెల్లడించారు. గేటు రోప్‌ తెగిపోవడం వల్ల తెలుగు గంగలోకి నీటి విడుదల తక్కువగా అవుతోందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..
బంగాళాఖాతంలో అల్పపీడనం

ఒక్కరోజే 6.93 కోట్లు
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 04:50 AM