ఒక్కరోజే 6.93 కోట్లు
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:42 AM
తిరుమల శ్రీవారికి రికార్డుస్థాయి హుండీ ఆదాయం లభించింది.
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
తిరుమల, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి రికార్డుస్థాయి హుండీ ఆదాయం లభించింది. బుధవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు స్వామిని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా రూ.6.93 కోట్లు లభించినట్టు టీటీడీ అధికారవర్గాలు తెలిపాయి. గుర్తుతెలియని ఓ వ్యక్తి రూ.కోటి వరకు హుండీలో సమర్పించడంతోనే ఇంత భారీగా ఆదాయం లభించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో రోజుకు సగటున శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్ల వరకు లభిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగాళాఖాతంలో అల్పపీడనం
తగ్గిన నేరాలు.. పెరిగిన ఆన్‌లైన్ మోసాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News