Share News

కేంద్ర నిధులు రాబడుతున్నాం

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:28 AM

కేంద్రం నుంచి వివిధ పథకాలకు నిధులు రాబడుతున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూ్‌షకుమార్‌, కార్యదర్శి డి.రొనాల్డ్‌ రోస్‌ వెల్లడించారు.

కేంద్ర నిధులు రాబడుతున్నాం
Chandrababu Naidu

  • ప్రాయోజిత పథకాల కింద ఇప్పటివరకు 10,552 వేల కోట్లొచ్చాయ్‌

  • కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు

  • పీయూష్‌కుమార్‌, రొనాల్డ్‌ రోస్‌ వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కేంద్రం నుంచి వివిధ పథకాలకు నిధులు రాబడుతున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూ్‌షకుమార్‌, కార్యదర్శి డి.రొనాల్డ్‌ రోస్‌ వెల్లడించారు. గురువారం కలెక్టర్ల సదస్సులో వారు కేంద్ర నిధులపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు .రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 86 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలవుతున్నాయని.. ఈ పథకాల కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.25,304 కోట్ల కేటాయింపులు ఉండగా.. ఇప్పటివరకు 10,552 కోట్లు (42 శాతం) అందాయని తెలిపారు.


ఇందులో రాష్ట్ర ఖజానాకు 325 కోట్లు, పథకాలు అమలు చేసే విభాగాలకు, లబ్ధిదారులకు నేరుగా 242 కోట్లు జమ కాగా.. మిగతా 9,986 కోట్లకు కేంద్రం ప్రధాన నిధుల మంజూరు ఉత్తర్వులు (మదర్‌ శాంక్షన్లు) ఇచ్చిందని చెప్పారు. పాత నిల్వలు (రూ.612 కోట్లు), వివిధ మార్గాల ద్వారా సర్దుబాటైన మొత్తాలను కలిపితే.. పథకాల అమలు విభాగాల వద్ద రూ.18,516 కోట్లు అందుబాటులోకి రాగా.. ఈనెల 7 నాటికి వీటిలో 8,694 కోట్లు (47 శాతం) ఖర్చయ్యాయన్నారు.


శాఖలవారీగా నిధుల వినియోగమిలా..

  • నిధుల ఖర్చులో బీసీ సంక్షేమ శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. ఈ శాఖకు కేంద్రం నుంచి 70 కోట్లు రాగా.. అందుబాటులో ఉన్న 316 కోట్లలో 313 కోట్లు (99 శాతం) ఖర్చు చేసింది.

  • పౌరసరఫరాల శాఖకు కేంద్రం కేటాయించిన రూ.168 కోట్లూ వంద శాతం విడుదల కాగా.. అందుబాటులో ఉన్న 336 కోట్లలో 98 కోట్లు (29 శాతం) మాత్రమే ఖర్చు చేసింది.

  • ఆహార శుద్ధి విభాగం 70 కోట్ల కేంద్ర నిధులను (91శాతం) రాబట్టుకుంది. అందుబాటులోని 113 కోట్లలో 59 కోట్లు (52శాతం) ఖర్చు చేసింది.


  • రవాణా, రోడ్లు-భవనాల శాఖ అందుబాటులోని 423 కోట్లలో 328 కోట్లు (78శాతం).. పురపాలక శాఖ 342 కోట్లలో 268 కోట్లు (78శాతం).. గిరిజన సంక్షేమ శాఖ 294 కోట్లలో 226 కోట్లు (77శాతం).. మహిళా, శిశు సంక్షేమ శాఖ 928 కోట్లలో 707 కోట్లు (76శాతం).. నైపుణ్యాభివృద్ధి శాఖ 42 కోట్లలో 31 కోట్లు (75శాతం).. సాంఘిక సంక్షేమ శాఖ 682 కోట్లలో 496 కోట్లు (73శాతం).. పశుసంవర్ధక-మత్స్య శాఖ 136 కోట్లలో 97 కోట్లు (71శాతం).. వైద్య ఆరోగ్య శాఖ 1895 కోట్లలో 1014 కోట్లు (54శాతం).. పాఠశాల విద్యాశాఖ 1,980 కోట్లలో 919 కోట్లు (46శాతం).. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ 1,580 కోట్లకు గాను 684 కోట్లు (43శాతం).. సెర్ప్‌ విభాగం 925 కోట్లలో 364 కోట్లు (39శాతం).. పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ రూ.7,440 కోట్లకు గాను 2,806 కోట్లు (38శాతం).. గృహనిర్మాణ శాఖ 829 కోట్లలో 216 కోట్లు (26శాతం ఖర్చుచేశాయి. జలవనరుల శాఖ అతితక్కువగా.. అందుబాటులోని 28 కోట్లలో 2 కోట్లు (6 శాతం) మాత్రమే వ్యయం చేసింది.


నిధుల ఖర్చులో చిత్తూరు టాప్‌.. విజయనగరం లాస్ట్‌

అందుబాటులో ఉన్న నిధుల ఖర్చులో 87 శాతంతో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది; అక్కడ రూ.81.6 కోట్లకు గాను 71.3 కోట్లు ఖర్చయ్యాయి. 52 శాతంతో విజయనగరం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్‌ జిల్లా, పశ్చిమ గోదావరి-85శాతం, పల్నాడు-83శాతం, కడప, తిరుపతి- 81శాతం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా-80శాతం.. మంచి ఫలితాలు సాధించాయి. నెల్లూరు, గుంటూరు జిల్లాలు-79శాతం, కర్నూలు-78శాతం, అనంతపురం-77శాతం, ఏలూరు- 76శాతం, ప్రకాశం-74శాతం, శ్రీసత్యసాయి, అన్నమయ్య-73శాతం, నంద్యాల-72శాతం, కాకినాడ-69శాతం, బాపట్ల, కృష్ణా జిల్లాలు-68శాతం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం-66శాతం, అల్లూరి, తూర్పు గోదావరి-65శాతం, అనకాపల్లి-64శాతం, విశాఖపట్నం జిల్లాలో 59 శాతం ఖర్చు నమోదైంది. రాష్ట్ర ప్రధాన కార్యాలయాల (హెడ్‌ ఆఫీస్‌) పరిధిలో అందుబాటులో ఉన్న రూ.16,602.80 కోట్లలో 7,307 కోట్లు (44 శాతం) ఖర్చయ్యాయి. ప్రస్తుతం వివిధ పథకాల సిస్టమ్‌ ఆఫ్‌ నేషనల్‌ అకౌంట్స్‌ (ఎస్‌ఎన్‌ఏ) ఖాతాల్లో ఇంకా 135 కోట్ల నిధులు మిగిలి ఉన్నాయి.


సాస్కీ కింద..

సాస్కీ పథకం ప్రోత్సాహకాల కింద రాష్ట్రం రూ.8,226 కోట్లు పొందే అవకాశం ఉండగా.. ఇప్పటికే 3,486 కోట్లు అందాయి; మిగిలిన 3,525 కోట్లను దక్కించుకోవడానికి ప్రభుత్వం నిర్దిష్ట సంస్కరణలను అమలు చేస్తోంది. గత సాస్కీ (2023-25) నిధులతో చేపట్టిన 4 ప్రధాన ప్రాజెక్టుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటికి రూ.516.35 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 313.27 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో అఖండ గోదావరి ప్రాజెక్టుకు 41.27 కోట్లు.. కడప జిల్లా గండికోట అభివృద్ధికి 44.51 కోట్లు, విశాఖ యూనిటీ మాల్‌కు 66.57 కోట్లు ఖర్చయ్యాయి. గాజువాక, ముడసర్లోవ, మధురవాడల్లో చేపట్టిన వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్ల పనులకు 32.81 కోట్లు వ్యయమయ్యాయి. సాస్కీ సంస్కరణలను డిసెంబరు 1లోగా నూరు శాతం పూర్తి చేయాలని.. కేంద్ర శాఖలకు పంపే ప్రతి సమాచార ప్రతినీ రాష్ట్ర ఆర్థిక శాఖతో పాటు ఢిల్లీ ఏపీ భవన్‌కు తప్పనిసరిగా పంపిస్తూ సమన్వయం చేసుకోవాలని పీయూ్‌షకుమార్‌, రొనాల్డ్‌ రోస్‌ స్పష్టం చేశారు.


పథకాలవారీగా వ్యయం

పథకాల వారీగా చూస్తే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అందుబాటులో ఉన్న రూ.1,573 కోట్లలో 1,567 కోట్లు (99 శాతం) ఖర్చయ్యాయి. గిరిజన విద్యార్థుల ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్పులు 95 శాతం, లైవ్‌స్టాక్‌ సెన్సస్‌ (95 శాతం), బీసీ పీఎం యశస్వి పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్పులు (99 శాతం), సీఆర్‌ఐఎఫ్‌ సేతుబంధన్‌ రోడ్డు పనులు (100 శాతం), సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (100 శాతం), పీఎం జన్‌మన్‌ (92 శాతం) పథకాల్లో నిధుల వినియోగం చాలా బాగుంది. సక్షమ్‌ అంగన్‌వాడీ8పోషణ్‌ 2.0 పథకంలో అందుబాటులో ఉన్న 779 కోట్లలో 642 కోట్లు (82 శాతం) ఖర్చయ్యాయి. అయితే కొన్ని పథకాల్లో ఖర్చు ఆశించిన స్థాయిలో లేదు. వికసిత్‌ భారత్‌: గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ గ్రామీణ్‌ (వీబీ:జీరామ్‌జీ) కింద అందుబాటులో ఉన్న రూ.4,242 కోట్లలో ఇప్పటివరకు 419 కోట్లే (10 శాతం) ఖర్చయ్యాయి. సెర్ప్‌ పరిధిలో జాతీయ వృద్ధాప్య పెన్షన్లకు కేంద్రం ఇచ్చిన రూ.130 కోట్లు, వితంతు పెన్షన్లకు ఇచ్చిన రూ.46 కోట్లు, దివ్యాంగుల పెన్షన్లకు ఇచ్చిన రూ.4.5 కోట్లలో వ్యయం నమోదు కాలేదని పీయూ్‌షకుమార్‌ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధికి జిల్లాలే చోదక శక్తులు!

తగ్గిన నేరాలు.. పెరిగిన ఆన్‌లైన్‌ మోసాలు
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 04:28 AM