Share News

ఇదే సరైన సమయం

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:35 AM

జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న, పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలను గుర్తించి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాలు, మండలాల పరిధిలో ప్రజలెదుర్కొంటున్న క్లిష్టమైన భూవివాదాలను వెలికితీయాలని, వీలైతే జిల్లా స్థాయిలో లేదా ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సినవి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదే సరైన సమయం

  • దీర్ఘకాలిక భూ సమస్యలు గుర్తించండి

  • పెండింగ్‌లో ఉన్నవాటిపై దృష్టిపెట్టండి

  • పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది

  • కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలి: సీఎస్‌

అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న, పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలను గుర్తించి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాలు, మండలాల పరిధిలో ప్రజలెదుర్కొంటున్న క్లిష్టమైన భూవివాదాలను వెలికితీయాలని, వీలైతే జిల్లా స్థాయిలో లేదా ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సినవి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పెండింగ్‌ భూ సమస్యల అంశం ప్రస్తావనకు వచ్చింది.

ఈ సందర్భంగా పలు జిల్లాలలో ప్రభుత్వం పరిష్కరించిన దీర్ఘకాలిక సమస్యలపై చర్చ జరిగింది. సాయిప్రసాద్‌ జోక్యం చేసుకొని.. కలిదిండి, వట్టిచెరుకూరు, అంబాజీపేట, అమలాపురం, రామచంద్రాపురం, గుంటుపల్లి, శెట్టిపల్లి, పీఎం పాలెం, భగత్‌సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో 100 ఏళ్లనాటి భూ సమస్యలను ప్రభు త్వం పరిష్కరించి పేదలు, హక్కుదారులకు మేలుచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంతటి దీర్ఘకాలికమైనా, సంక్లిష్టమైన భూ సమస్యలనైనా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేందుకు ఇదే సరైన సమయంగా గుర్తించి కలెక్టర్లు వారి జిల్లాల పరిధిలో ఉన్నవాటిని సర్కారు దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఎంతో కాలంగా ప్రజలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న భూ సమస్యలపై వెంటనే దృష్టిసారించాలని సీఎస్‌ ఆదేశించారు. ప్రతీ నెల 9వ తేదీ నాటికి వాటి పరిష్కారాలపై ఉత్తర్వులు ఇస్తోంది. ఈ నేపఽథ్యంలో ప్రభుత్వం దృష్టికి రాని, రైతులు ఏళ్లతరబడి ఎదుర్కొంటున్న భూ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఈ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎస్‌ చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి...

స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..

Updated Date - Sep 12 , 2026 | 03:35 AM