అరుదైన కిలోన్నర పులస.. మెగాస్టార్‌కు పంపనున్న అభిమాని
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:20 PM
అభిమాన హీరోల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు కొందరు. హీరో పుట్టినరోజులకు రక్తదానాలు చేయడం, కటౌట్లు పెట్టడం, క్షీరాభిషేకాలు.. ఇలా అభిమానాన్ని తమదైన పద్దతిలో చాటుకుంటారు. అయితే, గోదావరి జిల్లాకు చెందిన ఓ అభిమాని అరుదుగా దొరికిన పులసను వేలంలో రూ.20వేలకు దక్కించుకున్నారు. ఆ చేపను తన అభిమాన హీరో చిరంజీవి ఇంటికి పంపించనున్నట్లు తెలిపారు.
యానాం, (ఆంధ్రజ్యోతి): గౌతమి గోదావరిలో కిలోన్నర బరువున్న అరుదైన పులస మత్స్యకారులకు చిక్కగా.. దాన్ని యానాం మార్కెట్‌లో వేలం వేశారు. ఈ చేపను రూ.20 వేలకు ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. ఈ పులసను తన అభిమాన హీరో చిరంజీవికి కానుకగా పంపించనున్నట్లు తెలిపారు.
గోదావరి జిల్లాలో లభించే పులసకు చాలా క్రేజ్ ఉంటుంది. ఎంత ధరైనా సరే వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. తమ స్నేహితులకు, బంధువులకు, విదేశాల్లో ఉండే ఆత్మీయులకు పంపుతుంటారు. ‘పుస్తెలు అమ్మైనా పులస తినాలి’.. అని ఓ నానుడే ఉందంటే అర్ధం చేసుకోండి దాని క్రేజ్ ఎలాంటిదో.
ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో..
నదిలో కాలుష్యం పెరుగుతుండడంతో పులస చేపలు ఎక్కువగా లభించడంలేదని మత్స్యకారులు తెలిపారు. పైగా.. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు ఎక్కువగా లేకపోవడంతో చేపల లభ్యత చాలా తగ్గిందన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 నుంచి 5 పులసలు మాత్రమే లభించినట్లు వారు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఎండైనా వానైనా.. హైదరాబాద్ హైరానా
చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. ‘నిజం గెలిచింది’ అంటూ లోకేశ్ పోస్ట్
Read Latest AP News And Telugu News