పంటలకు ఊపిరి
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:08 AM
గుంటూరు జిల్లాలో 18 మండలాల్లోనూ వర్షం కురవగా, జిల్లా వ్యాప్తంగా ఆరుతడి పంటలు, పశుగ్రాసానికి ఎంతో మేలు చేసింది. ఎండే దశలో ఉన్న పత్తి పంటకు జీవం పోసింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగు చేస్తోన్న వరి పైర్లకు కూడా ఉపయోగకరమని వ్యవసాయ అధికారులు తెలిపారు.
చాగలమర్రి, విశాఖపట్నం, గుంటూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లాలో 18 మండలాల్లోనూ వర్షం కురవగా, జిల్లా వ్యాప్తంగా ఆరుతడి పంటలు, పశుగ్రాసానికి ఎంతో మేలు చేసింది. ఎండే దశలో ఉన్న పత్తి పంటకు జీవం పోసింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగు చేస్తోన్న వరి పైర్లకు కూడా ఉపయోగకరమని వ్యవసాయ అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని చిన్నవంగలి సమీపంలో రైతు చిన్నసంజీవరెడ్డి రెండెకరాల్లో సాగు చేసిన అరటిచెట్లు విరిగిపడ్డాయి. జ్ఞానాపురం రహదారిలో బాపతి శేఖర్‌రెడ్డి రెండెకరాల్లో అరటి సాగుచేయగా.. చెట్లు విరిగిపడడంతో రూ.1.5 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఆ రైతు వాపోయారు. విశాఖ, శివారు ప్రాంతాల్లో ఉదయం జోరున వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లు జలమమయ్యాయి. పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచింది. మార్కెట్లలో వినాయకచవితి సందర్భంగా అమ్మకానికి సిద్ధంచేసిన పూజా సామగ్రి తడిసిముద్దయింది.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’