Share News

నరసన్నపేటలో కుండపోత వర్షం

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:43 PM

నరసన్నపేటతోపాటు పరిసర గ్రామాల్లో అల్పపీడనం ప్రభావంతో ఆదివారం మధ్యాహ్నం కుండపోతగా వర్షం కురి సింది.

నరసన్నపేటలో కుండపోత వర్షం
నరసన్నపేటలో జలమయమైన ప్రధాన రహదారి

నరసన్నపేట, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నరసన్నపేటతోపాటు పరిసర గ్రామాల్లో అల్పపీడనం ప్రభావంతో ఆదివారం మధ్యాహ్నం కుండపోతగా వర్షం కురి సింది. 30 నిమిషాలపాటు ఏకదాటిగా వర్షం కురవడంతో నరసన్నపేటలోని పలు వీధులు జలమయమయ్యాయి. జమ్ము జంక్షన్‌ నుంచి సత్యవరం జంక్షన్‌ వరకు మెయిన్‌ రోడ్డుపై చెరువును తలపించేలా నీరు చేరింది. కొత్తబస్టాండ్‌లో రోడ్డుమీదకు వర్షం నీరుతో తోపుడు బండ్ల వ్యాపారులు ఇబ్బందిపడ్డారు. గాంధీనగర్‌, బజారువీధి, శివనగర్‌కాలనీ తదితర వీధులు జలమయమయ్యాయి. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, రోడ్ల మీద అక్రమణల వల్ల వర్షానికి వీధులు జలమయమవుతున్నా యని పలువురు వాపోతున్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:43 PM