పులస.. 2 కిలోలు @24వేలు
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:11 AM
యానాంలో రెండు కిలోల పులస రూ.24 వేలు ధర పలికింది. గోదావరికి ఎర్రనీరు వచ్చే సమయంలో మత్స్యకారులకు పులసలు దొరుకుతాయి.
యానాంలో రెండు కిలోల పులస రూ.24 వేలు ధర పలికింది. గోదావరికి ఎర్రనీరు వచ్చే సమయంలో మత్స్యకారులకు పులసలు దొరుకుతాయి. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో గోదావరికి వరదలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో పులసలు అరుదుగా దొరుకుతున్నాయి. నెల రోజుల కిందట మత్స్యకారుల వలలకు రెండు పులసలు చిక్కగా.. రూ.14, 15వేలకు విక్రయించారు. తాజాగా శుక్రవారం రెండు కిలోల పులస రూ.24వేలు ధర పలికింది. నాటి పార్వతి కుటుంబ సభ్యులు యానాం మార్కెట్‌లో దీనిని వేలం పాటలో దక్కించుకుని, మరికొంత లాభానికి అమ్మేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!
అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు