Share News

ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:31 AM

నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ సహా పలు నిర్వహణ వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)కి కేంద్ర ప్రభుత్వం కొత్త జవసత్వాలు ఇచ్చే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలువురు సీనియర్‌ జాతీయ సర్వీసు అధికారులను ఎన్టీఏ డైరెక్టర్లుగా నియమించింది.

ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌
Prasanna Venkatesh

  • కేంద్ర సర్వీసులకు గురుకుల సొసైటీ కార్యదర్శి

  • డైరెక్టరుగా ఏపీ ఐఏఎస్‌ అధికారి ప్రసన్న వెంకటేశ్‌కు అవకాశం

  • బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఉన్న వెంకటేశ్‌

అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ సహా పలు నిర్వహణ వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)కి కేంద్ర ప్రభుత్వం కొత్త జవసత్వాలు ఇచ్చే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలువురు సీనియర్‌ జాతీయ సర్వీసు అధికారులను ఎన్టీఏ డైరెక్టర్లుగా నియమించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఒక ఐఏఎస్‌ అధికారి కూడా ఉన్నారు. 2012 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రసన్న వెంకటేశ్‌ను ఎన్టీఏ డైరెక్టర్‌గా నియమిస్తూ డీవోపీటీ డిప్యూటీ సెక్రటరీ అజిత్‌కుమార్‌ రంజన్‌ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్‌ ప్రస్తుతం ఏపీలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల సొసైటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా కేంద్ర సర్వీ్‌సలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌వోసీ ఇవ్వడంతో కేంద్రం ఆయనను ఎన్టీఏ డైరెక్టర్‌గా నియమించింది. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఇన్‌కంట్యాక్స్‌)కు చెందిన 2005 బ్యాచ్‌ అధికారి అన్షుమన్‌ శర్మను సంయుక్త కార్యదర్శిగా, 2016 బ్యాచ్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (కస్టమ్స్‌, పరోక్ష పన్నులు) అధికారి అమిత్‌ సమ్‌దరియాను సంయుక్త డైరెక్టర్‌గా నియమించారు. ప్రసన్న వెంకటేశ్‌తోపాటు సాథియా ఎస్‌, రవికుమార్‌సింగ్‌లను డైరెక్టర్లుగా నియమించారు. సాథియా ఐఆర్‌ఎస్‌ (ఇన్‌కంట్యాక్స్‌) అధికారి కాగా, రవికుమార్‌ ఐపీఎస్‌ అధికారి. భిన్న విభాగాలకు చెందిన అధికారులను సంస్థలో భాగస్వాములను చేయటం ద్వారా ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహించే స్థిరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణపై వివాదం..

ఢిల్లీ-బిలాస్‌పూర్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

Updated Date - Aug 29 , 2026 | 03:32 AM