ప్రశ్నిస్తే ఇంత నీచానికి దిగజారుతారా? వైసీపీ మహిళా నాయకురాలి సంచలన వీడియో
ABN , Publish Date - Jul 11 , 2026 | 09:41 AM
ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి చెందిన ఎస్టీ సెల్ మహిళా అధ్యక్షురాలు ప్రసన్న ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పార్టీలో తనకు జరిగిన అవమానం, అన్యాయంతో తీవ్ర మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రకాశం జిల్లా: ఒంగోలులో వైసీపీకి చెందిన గిరిజన మహిళా నాయకురాలు, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 8న నిర్వహించిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో తనను తోసివేశారని, కాళ్లు తొక్కారని ప్రసన్న ఆరోపించారు. ఈ ఘటనపై ప్రశ్నించడంతో కొందరు వైసీపీ నాయకులు తనపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు.
తన తల్లిపై దాడి జరిగిందన్న ఆగ్రహంతో ప్రసన్న కుమారుడు మదన్ కుమార్, వైసీపీ నేత శివకుమార్‌పై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనల అనంతరం ఒంగోలు వైసీపీ ఇన్‌చార్జ్ పార్టీకి సంబంధించిన గ్రూపుల నుంచి ప్రసన్నను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నానికి ముందు పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రసన్న ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.
Also Read:
కిడ్నీ బాధితులు బీట్‌రూట్ తినొచ్చా?
రోజూ 5 కప్పుల కాఫీ.. లివర్‌కు మంచిదా?