Share News

గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Jul 22 , 2026 | 07:27 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం, కారు ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Prakasam Road Accident

ప్రకాశం జిల్లా: గిద్దలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం, కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు, గాయపడిన వారి గుర్తింపును అధికారులు సేకరిస్తున్నారు.


Also Read:

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

ఆధారాలు లేకుండా నాపై నేరం మోపారు: నటి కాదంబరి జెత్వాని లేఖ

Updated Date - Jul 22 , 2026 | 07:59 PM