Share News

30 ఏళ్ల సంకల్పం నెరవేరింది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 25 , 2026 | 03:05 PM

వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 31న ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 30 ఏళ్ల క్రితం తాను తీసుకున్న సంకల్పం నెరవేరిందంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

30 ఏళ్ల సంకల్పం నెరవేరింది: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu On Veligonda Project

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 30 ఏళ్ల క్రితం తాను తీసుకున్న సంకల్పం ఇప్పుడు నెరవేరిందంటూ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా తన భావాలను పంచుకున్నారు. “వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు” అంటూ ట్వీట్‌ చేశారు. 30 ఏళ్ల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన ఫొటోను కూడా ఈ సందర్భంగా జత చేశారు.


ప్రతి రైతు పొలానికి నీరు అందించడంతో పాటు ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించాలన్నదే తన సంకల్పమని చంద్రబాబు పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి సాగునీరు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించి, ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


Also Read:

ఆన్‌లైన్ స్నేహం పేరుతో భారీ మోసం.. కోటిన్నర పోగొట్టుకున్న యువతి

అన్నీ తెలిసే నా గొంతు కోశారు.. జోగి రమేశ్ కోడలి కన్నీటి పర్యంతం

Updated Date - Aug 25 , 2026 | 03:35 PM