6న చీరాల ఓట్ల లెక్కింపు
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:56 AM
మురసు తుఫాన్ రాష్ట్రంలోని పలుచోట్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై ప్రభావం చూపింది. మంగళవా రం భారీ వర్షాలు కారణంగా బాపట్ల జిల్లాలోని చీరాల మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది.
మురుసు తుఫాన్ ప్రభావంతో వాయిదా
అమరావతి/బాపట్ల/ఒంగోలు, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్ రాష్ట్రంలోని పలుచోట్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై ప్రభావం చూపింది. మంగళవా రం భారీ వర్షాలు కారణంగా బాపట్ల జిల్లాలోని చీరాల మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి, బాపట్ల జిల్లాలోని రేపల్లె మున్సిపాలిటీ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు బదులు ఆలస్యం గా ప్రారంభమైంది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో చీరాల మున్సిపాలిటీ కౌంటింగ్‌ను ఈ నెల 6న జరుపుతామని అధికారులు ప్రకటించారు.
ఒంగోలులో వర్షం, గాలుల తీవ్రత తగ్గిన తర్వాత మధ్యాహ్నం 12 తర్వాత లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. అటు ఉదయం 11:30 సమయంలో రేపల్లె మున్సిపాలిటీ స్థానం కౌంటింగ్ మొదలైంది. బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు, గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులతో చీరాల మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మంగళవారం తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తే ఎన్నికల అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్లు, ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అంతేకాకుండా లెక్కింపు కేంద్రంలోకి వర్షపు నీరు చేరి బ్యాలెట్ బాక్సులు, కీలక ఎన్నికల పత్రాలు దెబ్బతినే ప్రమాదం ఉందని బాపట్ల జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించారు.
ఈ క్రమంలో 4న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సామగ్రి తరలింపు, 5న పోలింగ్ ఉండటంతో ఈ నెల 6కి చీరాల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం