ఆదాయానికి మించి ఆస్తులు.. సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:12 AM
ప్రకాశం జిల్లాలో ఏసీబీ సోదాల కలకలం రేగింది. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన నామన కృష్ణ మోహన్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా, మార్చి 7: నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన నామన కృష్ణ మోహన్ రావు నివాసం, బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గత ఏడాది గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఒక రైతు నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కృష్ణ మోహన్. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు రావడంతో కృష్ణ మోహన్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
చీరాల మండలం పేరాల, చిన్నగంజాం మండలం కడవకుదురు, పొన్నూరు మండలం నందూరు ప్రాంతాల్లోని కృష్ణ మోహన్ రావు, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ బృందాలు దాడులు జరిపాయి. ఆస్తుల వివరాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
దుర్గమ్మ ఆలయంలో 50 లక్షల బంగారం మిస్సింగ్
మేము ఎలాంటి అపచారం చేయలేదు: దువ్వాడ శ్రీనివాస్, మాధురి
Read Latest AP News And Telugu News