Antarvedi Temple: అంతర్వేది రథ శకలాల నిమజ్జన కార్యక్రమం వాయిదా
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:36 PM
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథ శకలాల నిమజ్జన కార్యక్రమం వాయిదా పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దహనమైంది. ఈ ప్రక్రియను మరో ముహూర్తంలో అత్యంత శాస్త్రబద్ధంగా నిర్వహించాలని దేవదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.
అమరావతి, జనవరి 3: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Antarvedi Lakshmi Narasimha Temple) వారి రథ శకలాల నిమజ్జన కార్యక్రమం వాయిదా పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దహనమైన సంగతి తెలిసిందే. ఆ రథం స్థానంలో కొత్త రథాన్ని అంతర్వేది దేవస్థానం ఏర్పాటు చేసింది. పాత రథాన్ని ఆగమశాస్త్ర విధానాలు, నిబంధనలకు లోబడి నిమజ్జనం చేసే కార్యక్రమంపై ఇటీవలే దేవాదాయ శాఖ కార్యాచరణ ప్రకటించింది. ఈ ప్రకారం రేపు(ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు రథ శకలాల నిమజ్జనం చేయాల్సి ఉంది.
అయితే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. ఆగమశాస్త్ర నిబంధనలు, మూహూర్తాలపై చర్చించిన అనంతరం దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మరింత విస్తృత చర్చల అనంతరం... పూర్తి స్థాయి ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం అభిప్రాయాలు సేకరించి రథ శకలాలను నిమజ్జనం చేయాలని నిర్ణయించింది. భక్తుల మనోభావాల నేపథ్యంలో నిమజ్జన(Antarvedi Ratha ceremony) ప్రక్రియను మరో ముహూర్తంలో అత్యంత శాస్త్రబద్ధంగా నిర్వహించాలని దేవస్థానం, దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్
గాల్లో చక్కర్లు కొట్టిన సింగపూర్ ఇండిగో ఫ్లైట్.. అరగంట తర్వాత..