Share News

మీ మాటలు మా కుటుంబానికి ఎంతో విలువైనవి: మంత్రి మనోహర్

ABN , Publish Date - Apr 29 , 2026 | 10:59 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) మృతిపై ప్రధాని మోదీ పంపిన సంతాప సందేశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞత తెలిపారు.

మీ మాటలు మా కుటుంబానికి ఎంతో విలువైనవి: మంత్రి మనోహర్
Nandendla Bhaskar Rao

అమరావతి, ఏప్రిల్ 29: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. నాదెండ్ల భాస్కర రావు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాప సందేశం పంపారు. ఏపీ ప్రజలకు దశాబ్దాల పాటు భాస్కరరావు తన జీవితాన్ని అంకితం చేసి.. అనేక సేవలందించారని కొనియాడారు. ఆయన అనుభవజ్ఞుడైన ప్రజా నాయకుడని, పలుమార్లు చట్ట సభలకు ఎన్నికై నిబద్ధతతో, చిత్తశుద్ధితో ప్రజా సమస్యలను వినిపించారని ప్రధాని తెలిపారు.


'నాదెండ్ల భాస్కరరావు లేని లోటు పూడ్చలేనిది. ఆయన మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన జ్ఞాపకాలు అందరి హృదయాలలో చిరకాలం నిలిచి ఉంటాయి. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు మీ కుటుంబంతోనే ఉన్నాయి' అని ఏపీ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌కి పంపిన సందేశంలో పేర్కొన్నారు. కాగా ప్రధాని సందేశం పట్ల మంత్రి నాదెండ్ల మనోహర్ కృతఙ్ఞతలు తెలిపారు.


'మీరు తెలిపిన ఓదార్పు మాటలు మా కుటుంబానికి ఎంతో విలువైనవి' అంటూ ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 22న మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.


ఇవి కూడా చదవండి...

బెంగాల్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..

బెంగళూరులో శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Updated Date - Apr 29 , 2026 | 11:36 AM