Share News

పెద్దాపురంలో వైసీపీకి భారీ షాక్‌

ABN , Publish Date - Sep 14 , 2026 | 04:59 AM

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంంలో వారు తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు.

పెద్దాపురంలో వైసీపీకి భారీ షాక్‌

  • పార్టీకి కీలక నేతల రాజీనామా.. జనసేనలో చేరుతామని ప్రకటన

పెద్దాపురం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంంలో వారు తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు. మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌ మాట్లాడుతూ.. తాను 4 రోజుల క్రితమే వైసీపీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు తోట గోపాలకృష్ణతో కలిసి ప్రజలు, కార్యకర్తలకు అండగా నిలిచానన్నారు. అయితే, వ్యక్తిగత కారణాలతో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తనతో పాటు మరో 10మంది వైసీపీకి చెందిన మాజీ కౌన్సిలర్లు, యూత్‌ ప్రెసిడెంట్‌ సహా పలువురు ముఖ్య నాయకులు కూడా కొద్ది రోజుల క్రితమే తమ పదవులకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు.


త్వరలోనే జనసేన పార్టీలో చేరాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సిద్ధాంతాలు, ఆయన నాయకత్వ శైలి నచ్చడంతో పాటు వార్డుల్లోని పెద్దల సలహాల మేరకు జనసేన పార్టీలో చేరాలని నిశ్చయించుకున్నట్టు తెలిపారు. జనసేన నేతలు.. మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, జనసేన పెద్దాపురం ఇన్‌చార్జి తుమ్మల రామస్వామి తదితరుల ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌ వచ్చిన తర్వాత అందరం కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరతామన్నారు. వైసీపీ నేతలు తమపై బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని.. పార్టీ మనుగడ, నాయకులపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని సాయిప్రసాద్‌ మండిపడ్డారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్లు విజ్జపు రాజశేఖర్‌, ఆరెళ్ల వీర రాఘవరావు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 04:59 AM