Share News

మోదీకి బాబు, పవన్‌, లోకేశ్‌ శుభాకాంక్షలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:22 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఎక్స్‌లో... ‘గుజరాత్‌ ముఖ్యమంత్రి నుంచి భారత ప్రధాని వరకు మోదీ 25 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రజాసేవ చేస్తున్నారు. మోదీ విప్లవాత్మక నాయకత్వం వల్ల దేశం అభివృద్ధి పథంలో కొత్త వేగం పుంజుకుంది.

మోదీకి బాబు, పవన్‌, లోకేశ్‌ శుభాకాంక్షలు

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఎక్స్‌లో... ‘గుజరాత్‌ ముఖ్యమంత్రి నుంచి భారత ప్రధాని వరకు మోదీ 25 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రజాసేవ చేస్తున్నారు. మోదీ విప్లవాత్మక నాయకత్వం వల్ల దేశం అభివృద్ధి పథంలో కొత్త వేగం పుంజుకుంది. మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో దేశసేవలో నిమగ్నమవ్వాలని వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు. పవన్‌ ఎక్స్‌లో స్పందిస్తూ... ‘ప్రధాని మోదీ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఆయన సేవా ప్రస్థానం దేశ ఆకాంక్షలకు రూపునిస్తుంది. 25 సంవత్సరాల నిస్వార్థ సేవతో పాటు మరింత కాలం దేశానికి సేవ చేసేందుకు సంసిద్ధమైన ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌కు మోదీ అందించిన, అందిస్తున్న మద్దతు అమూల్యమైనది. ప్రధాని మోదీ మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును పొందాలి’ అని ఆకాంక్షించారు. మంత్రి లోకేశ్‌.. మోదీకి వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లి నివాసంలో ‘నమో జయీభవ’ అంటూ ఆశ్వీరాద దీపం వెలిగించి ప్రధానికి, లోకేశ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 04:22 AM