Share News

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:28 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఇతర సమస్యలపై తెలంగాణలో బీజేపీ ఉద్యమం చేస్తూ.. అవే సమస్యలపై ఏపీలో పెదవి విప్పకుండా ద్వంద్వవైఖరి అవలంబిస్తోందని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.

 బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ

బొబ్బిలి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఇతర సమస్యలపై తెలంగాణలో బీజేపీ ఉద్యమం చేస్తూ.. అవే సమస్యలపై ఏపీలో పెదవి విప్పకుండా ద్వంద్వవైఖరి అవలంబిస్తోందని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురు వారం సాయంత్రం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ రెసిడెన్సీలో మాజీ ఎమ్మెల్యే శం బంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమవేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపె విరుచుకుపడ్డారు. ఇటీవల టీడీపీలో చేరిన జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుపై బొత్స పరోక్షంగా విమర్శలు గుప్పించారు. నిన్నటి వరకు అవినీతిపరులు, దోపిడీదారులని చెబుతూనే నేడు వారి చెంతకు చేరా రన్నారు. ఎవరు వెళ్లిపోయినా పార్టీ శాశ్వతం అని, ఎవరూ ఎటువంటి ఆందో ళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. మరో రెండున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని, జగన్‌ మళ్లీ సీఎం అవడం తఽథ్యమని జోస్యం చెప్పారు. స్థానిక ఎన్నికల్లో న్యాయానికి - అన్యాయానికి మధ్య పోటీ నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్ర శేఖర్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే లోకేశ్‌ అరెస్టు కావడం ఖాయమన్నారు. సమావేశంలో బొత్స కుమార్తె డాక్టర్‌ అనూష, ఎమ్మెల్సీ పెను మత్స సురేష్‌, డాక్టర్‌ బొత్స సందీప్‌, రొంగల జగన్నాథం, కేవీ సూర్య నారాయణరాజు, శంబంగి వేణుగోపాలనాయుడు, నర్సుపల్లి ఉమాలక్ష్మి, బొత్స కాశినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 12:28 AM