Pawan Kalyan: బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం: డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:59 PM
కాకినాడలో రూ.18వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు, డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలమని పవన్ అన్నారు.
కాకినాడ, జనవరి18: బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. కాకినాడలో రూ.18వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.
'అనేక కష్టనష్టాలను తట్టుకుని ఏఎం గ్రీన్ కంపెనీ(AM Green Ammonia Project)పెట్టారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకెళ్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ దిశగా మనం వేసే అడుగులు చాలా ముఖ్యమైనవి. ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాము' అని పవన్ అన్నారు.
'కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో మైలురాయి. రెన్యువబుల్ ఎనర్జీ(Renewable Energy) రంగంలో అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఏఎం గ్రీన్ కంపెనీ రాష్ట్ర సుస్థిరాభివృద్ధిలో గేమ్ ఛేంజర్ కానుంది. ఈ ప్రాజెక్టు వల్ల వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారు. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల ఇబ్బందులు తెలుసు. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలను వేధించారు. పార్టీలు మారవచ్చు. కానీ, ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతం’ అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్(Green Ammonia Production)ను ఏఎం గ్రీన్ సంస్థ కాకినాడలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. రూ.13వేల కోట్లతో 495 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే.. ఏఎం గ్రీన్ సంస్థ ఏటా 1,950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్‌ను ఉత్పత్తి చేయనుంది. జర్మనీ, జపాన్, సింగపూర్‌కు గ్రీన్ అమ్మోనియాను ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్
మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు