Share News

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jul 19 , 2026 | 04:04 PM

బల్లగరువు పర్యటనలో ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిలబెట్టుకున్నారు. కోటి రూపాయల వ్యయంతో అంగన్వాడీ భవనాలు, తాగునీటి సదుపాయం, సీసీ రోడ్లు సహా పలు అభివృద్ధి పనులను పూర్తి చేయించారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Pawan Kalyan

అమరావతి, జులై 19: బల్లగరువు పర్యటనలో ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిలబెట్టుకున్నారు. ఇటీవల బల్లగరువు పర్యటన సందర్భంగా గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ గ్రామంలో సుమారు కోటి రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను పూర్తి చేయించారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, తాగునీటి వసతులు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులను పూర్తి చేయించారు.


గ్రామంలోని చిన్నారులు, మహిళల విజ్ఞప్తి మేరకు రూ.55 లక్షల వ్యయంతో మూడు కొత్త అంగన్వాడీ భవనాలను నిర్మించారు. అలాగే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా బోరు ఏర్పాటు చేసి, నీటి సరఫరా కోసం పైప్‌లైన్లను నిర్మించారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతో రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడ్డాయి. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు.. నలుగురి మృతి, ఐదుగురి గల్లంతు..

ఫేక్ ఓఎమ్ఆర్ షీట్స్ వద్దు.. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎన్‌టీఏ అలర్ట్

Updated Date - Jul 19 , 2026 | 04:19 PM