మురసు తుఫాన్‌తో 400 ఎకరాల్లో పంట నష్టం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:55 PM
మురసు తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాదెండ్ల మండలంలోని తూబాడు చెరువు పరిసరాల్లో 400 ఎకరాలకు పైగా పంట పొలాలు నీట మునిగాయి.
పల్నాడు, నవంబర్ 8: జిల్లాలో మురసు తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాదెండ్ల మండలంలోని తూబాడు చెరువును ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. తుఫాన్ కారణంగా చెరువులకు గండ్లు పడటంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. సుమారు 400 ఎకరాలకు పైగా పంట నీటిపాలైనట్లు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పొలాలను పరిశీలించిన ప్రత్తిపాటి.. రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టం, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వివరాలు తెలుసుకున్నారు.
చెరువులకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టం వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు