కలెక్టర్ల సదస్సు నిర్ణయాల్ని పక్కాగా అమలు చేయండి
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:58 AM
కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు పక్కాగా అమలయ్యేలా సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఈ నెల 10, 11 తేదీల్లో జరిగిన కలెక్టర్ల సదస్సులో పలు నిర్ణయాలను తీసుకున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి నిర్ణయాల అమలు కచ్చితంగా జరగాలని సీఎం భావిస్తున్నారు.
ఫైళ్లు క్లియర్ చేయని అధికారుల వివరణ తీసుకోండి
వివరణ సంతృప్తిగా లేకుంటే చర్యలు తీసుకోండి
సీఎస్ సాయిప్రసాద్‌ను ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు పక్కాగా అమలయ్యేలా సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఈ నెల 10, 11 తేదీల్లో జరిగిన కలెక్టర్ల సదస్సులో పలు నిర్ణయాలను తీసుకున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి నిర్ణయాల అమలు కచ్చితంగా జరగాలని సీఎం భావిస్తున్నారు. ఆయా శాఖల సెక్రటరీలు, హెచ్‌వోడీలకు ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని సీఎస్ సాయిప్రసాద్‌ను ఆదేశించారు. అలాగే ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబడిన జిల్లాలు, రాష్ట్రస్థాయి అధికారుల నుంచి వివరణ కోరాలని సీఎంవోకు ఆదేశించారు. అకారణంగా, అలసత్వం కారణంగా ఫైళ్లు క్లియర్ చేయని, నిర్ణయాలు తీసుకోని వారి జాబితా తయారు చేయాలని సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సరైన కారణం లేకుండా ఫైళ్లను డిస్పోజ్ చేయని అధికారుల వివరణ సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్‌గా గుర్తించిన అంశాలు అన్ని జిల్లాల్లో అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి నిర్ణయాలు జిల్లా స్థాయిలో అమలుపై తన జిల్లా పర్యటన సందర్భంగా పరిశీలిస్తానని సీఎం స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి