Share News

మహిళా భద్రతలో ఫస్ట్‌ర్యాంకు

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:54 AM

మహిళల భద్రతపై ప్రజా భిప్రాయంలో ఏలూరు జిల్లా మొదటి స్థానంలోను, గంజాయి అణిచి వేతలో 5వ స్థానంలో నిలిచింది.

మహిళా భద్రతలో ఫస్ట్‌ర్యాంకు

గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనలో ఐదో ర్యాంకు

జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని అభినందించిన సీఎం

ఏలూరు క్రైం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి):మహిళల భద్రతపై ప్రజా భిప్రాయంలో ఏలూరు జిల్లా మొదటి స్థానంలోను, గంజాయి అణిచి వేతలో 5వ స్థానంలో నిలిచింది. ఇటీవల రాష్ట్ర సచివాలయంలో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్‌ను, జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని సీఎం అభినందించారు. సీఎం కార్యాలయం నుంచి నిర్వహిస్తున్న ప్రజా భిప్రాయ సమాచారం ప్రకారం 67.9గా స్కోరు నమోదై మహిళల భద్రత, మహిళలపై నేరాల నివారణ అంశంలో జిల్లా మొదటి ర్యాంకును సాధిం చింది. గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణ అంశంలో 71.3 శాతంగా స్కోరు నమోదైంది. ఇది రాష్ట్ర సగటుకంటే 2.8 పాయింట్లు ఎక్కువ. ఎస్పీ ఏర్పాటుచేసిన ఈబీట్‌ వ్యవస్థతో పోలీస్‌ పెట్రోలింగ్‌, డ్రోన్‌ కెమెరాలతో నిఘా, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం వంటి అంశాలతో ఈ ఫలితాలు స్పష్టంగా వచ్చాయి.

రెండు మార్గాలతోనే ప్రమాదాలు

ఏలూరు ఆశ్రం ఆసుపత్రి సమీపంలో ఎన్‌హెచ్‌ 16 రహదారిపై ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడ రెండుగా విడిపోయిన రైల్వే బ్రిడ్జిని ఏక బ్రిడ్జిగా నిర్మించాలని ఎస్పీ కిశోర్‌ సీఎం దృష్టికి తీసుకెళ్లారు జాతీయ రహదారిపై రైల్‌ ఓవర్‌ బ్రిడ్జిని ఆశ్రం సమీపంలో నిర్మించారని, అక్కడ వరకు ఒకటిగా ఉన్న బ్రిడ్జి అకస్మాత్తుగా రెండుగా విడిపోవడంతో వాహనదారులు అయోమయానికి గురై ప్రమా దాల పాలవుతున్నారని, పోలీస్‌ యంత్రాంగం అక్కడ బారికేడ్లు అడ్డుపెట్టి వాహనాలను మళ్లిస్తున్నామని, బ్రిడ్జిని రెండుగా కాకుండా ఒకటిగా ఉండే లా చర్యలు చేపట్టాలని కోరుతూ ఒక వీడియోను సీఎంకు చూపించి సమస్యను వివరించారు. ఏకమార్గంగా నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతు లు వచ్చినా ఎన్‌హెచ్‌ఎఐ అధికారులు నిర్మాణానికి ముందుకు రావడం లేదని చెప్పడంతో తానే స్వయంగా ఇరు శాఖలతో మాట్లాడి ఆర్వోబీ ఏకమార్గ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని సీఎం స్పష్టం చేశారు.

Updated Date - Sep 13 , 2026 | 12:54 AM