తెలుగుజాతికి ఎన్నారైలు బ్రాండ్ అంబాసిడర్లు
ABN , Publish Date - Sep 10 , 2026 | 04:24 AM
‘‘చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి మూడేళ్లు అయింది. దొంగ కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రపంచంలోని తెలుగువారంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడారు. 50 దేశాల్లో 200 పట్టణాల్లో ఎన్‌ఆర్‌ఐలు కార్యక్రమాలు నిర్వహించారు. ‘ఐయామ్ విత్ సీబీఎన్’ కార్యక్రమం మా కుటుంబానికి కొండంత అండగా నిలిచింది.
2029 ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాల్సిన బాధ్యత అందరిదీ
గ్లోబల్ ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో లోకేశ్
కమిటీ నూతన అధ్యక్షుడిగా పిల్ గురురాజా ప్రమాణం
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘‘చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి మూడేళ్లు అయింది. దొంగ కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రపంచంలోని తెలుగువారంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడారు. 50 దేశాల్లో 200 పట్టణాల్లో ఎన్‌ఆర్‌ఐలు కార్యక్రమాలు నిర్వహించారు. ‘ఐయామ్ విత్ సీబీఎన్’ కార్యక్రమం మా కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. మళ్లీ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకునేలా చేసింది’’ అని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. 45 మందితో ఏర్పాటైన ఆ కమిటీతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ పిల్ గురురాజా ప్రమాణం చేశారు. అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన సభ్యు లు జూమ్‌కాల్ ద్వారా ప్రమాణం స్వీకారం చేశారు. మంత్రి లోకేశ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినపుడు రూ.3 వేల కోట్ల అవినీతి అన్నారు. తర్వాత 300 కోట్లు, తర్వాత 3 కోట్లు అన్నారు. చివరకు ఒక్క రూపాయి అవినీతిని నిరూపించలేకపోయారు. ఐటీ, ఈడీ, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. తెలుగుజాతి నం.1గా ఉండాలని చంద్రబాబు ఎప్పుడూ ఆలోచిస్తా రు. అలాంటి నాయకుడికి అందరం అండగా నిలవాలి. తెలుగుజాతిని నం.1గా చేసే బాధ్యతను మనందరం సమష్టిగా తీసుకుందాం. 2029 ఎన్నికల్లో ఎన్డీయేని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.’’ అన్నారు.
కేసులకు భయపడకుండా పోరాడారు..
వైసీపీ పాలనలో 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారు. ఆనాడు అమరావతి ఉద్యమానికి ఎన్‌ఆర్‌ఐలు మద్దతుగా నిలిచారు. కేసులు పెట్టినా భయపడకుండా పో రాడారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించారు. కష్టపడి సంపాదించిన డబ్బులో 5 వేల డాలర్లు ఖర్చుపెట్టి ఓటు వేయడానికి రాష్ర్టానికి వచ్చారు. కొన్ని నెలల పాటు ఉద్యోగాలకు సెలవు పెట్టి గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్య పరిచారు. ప్రజాప్రభుత్వ ఏర్పాటులో ఎన్‌ఆర్‌ఐలు కీలక భాగస్వాములు. ఎన్‌ఆర్‌ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మంచి ఉద్యోగాలు చేస్తున్నా.. నమ్మిన పార్టీ కోసం, తెలుగుజాతి కోసం నిలబడ్డారు. ఎన్‌ఆర్‌ఐలు తెలుగుజాతికి బ్రాండ్ అంబాసిడర్లు. మీరు పనిచేసే కంపెనీలు ఏపీకి వచ్చేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. ఏపీ అభివృద్థిలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వామ్యం కావాలి. పార్టీలో ఎన్‌ఆర్‌ఐ సభ్యత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరంతా ‘మై టీడీపీ యాప్’తో అనుసంధానం కావాలి. 2019-24 మధ్య అనేక మంది న్యూట్రల్స్‌కు ఫోన్ చేసి ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషిచేశారు. తిరిగి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. డాక్టర్ గురురాజాపై బాధ్యత పెరిగింది.’’ అని లోకేశ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నిస్వార్థ ప్రజా సేవ కు ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ప్రతీక అన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐల సహకారం మరువలేనిదన్నారు.
నూతన ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కమిటీ ఇదీ
ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ పిల్ గురురాజా, జనరల్ సెక్రటరీలుగా డాక్టర్ చలసాని కిశోర్‌బాబు, బొడ్డు గంగాధర్‌రావు, డాక్టర్ ముక్కు తులసికుమార్, ఉపాధ్యక్షులుగా కోమటి జయరాం, పుట్టగుంట సురేశ్, మద్దిపట్ల ఇంద్రసేన నాయుడు, రషీదా షేక్, కోడూరి శ్యాంప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా.. కానూరు హేమచంద్రశేఖర్, ముప్పవరపు మాధవి, డాక్టర్ చావా పద్మ, షాఫహద్ సయ్యద్, ఆళ్ల వెంకట్, చెంచు వేణుగోపాల్‌రెడ్డి, బొద్దులూరి యాష్, అన్నమేటి బాల సుబ్రహ్మణ్యం, నక్కల శివనాగరాజు, అడుసుమిల్లి విజయకుమార్, జవ్వాది విజేత, ఖాలిద్ సైఫుల్లా, కౌతారపు లావణ్య, కోడి రాజారవికిరణ్, రాచూరి రెడ్డి మోహన్, చెన్నుపాటి విజయ్, కార్యదర్శులుగా.. అడుసుమిల్లి కృష్ణప్రియ, రవడ సుభాశ్, బెజవాడ సూర్య, పరుచూరి తరణీధర్, జడ నాగరాజు, పొనుగోటి పింకీ రేవతి, పల్లేటి రాజేశ్ బాబు, గోగినేని శ్రీనివాస్, నన్నా అనిల్ కుమార్, గాలి దుర్గాభవాని, పేరూరు రామకృష్ణ, వంకా వెంకటరమణమ్మ, నంబళ్ల గోపీ రవికుమార్, పరుచూరి కవిత, జొన్నలగడ్డ నర్మద, గుడివాడ వెంకటరమణ, కోశాధికారిగా అబ్బూరి శ్రీనివాస్, మీడియా కో-ఆర్డినేటర్‌గా దొడ్డపనేని సాగర్, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లుగా బొల్లినేని సాయి, కోట గౌతమీశ్వేత ప్రమాణం చేశారు.
దానయ్య కుటుంబానికి సాయం
పలాసలో మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలకాపరి దుబ్బ దాన య్య కుటుంబానికి గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కమిటీ అండగా నిలిచింది. కమిటీ ప్రతినిధులు సురేశ్ పుట్టగుంట, షాఫహాద్ సహకారంతో రూ.1.50 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. బుధవారం గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఫోరం ప్రతినిధులు ప్రమాణస్వీకారం చేసిన రోజునే దానయ్య కుటుంబానికి ఆర్థికసాయం అందించడం గమనార్హం.
ఎన్‌ఆర్‌ఐ టీడీపీ శ్రేణులను ఒకేతాటిపైకి తెస్తాం
లోకేశ్ ఆలోచన ప్రకారం ఎన్‌ఆర్‌ఐ టీడీపీ శ్రేణులను ఒకేతాటిపైకి తీసుకురావడం నా ప్రధాన బాధ్యత. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం.. టీడీపీ మనుగడ కోసం ఎన్‌ఆర్‌ఐలు చేసి పోరాటం ఆమోఘం. పార్టీ శ్రేణులకు అండగా నిలవడం, సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎన్‌ఆర్‌ఐలు కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ చైతన్యరథం యాత్రతో యువకుడిగా నా ప్రయాణం ప్రారంభమైంది. డాక్టర్‌గా అమెరికా వెళ్లినా పార్టీ సిద్ధాంతం మరువలేదు.
- గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ నూతన అధ్యక్షుడు డాక్టర్ పిల్ గురురాజా
2029 లక్ష్యంగా పార్టీ బలోపేతానికి కృషి
ఎన్‌ఆర్‌ఐ టీడీపీ గత 30 ఏళ్లుగా పార్టీకి అండగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ శ్రేణులను లోకేశ్ విజన్‌తో ఒకే యూనిట్‌గా తీర్చిదిద్దే కొత్త అధ్యాయానికి ఈ కార్యక్రమం నాంది పలికింది. 2029 లక్ష్యంగా ప్రతి ఎన్‌ఆర్‌ఐ పార్టీ బలోపేతానికి కృషి చేసి, లోకేశ్‌కు అండగా నిలుస్తాం.
- ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం
ఈ వార్తలనూ చదవండి:
రెన్యువల్ అయ్యేలా చర్యలు చేపట్టండి