Share News

సీఆర్‌డీఏ గ్రామాల్లో ఎన్నికలు లేవు

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:24 AM

సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే రాజధాని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని మంత్రి నారాయణ కార్యాలయ వర్గాలు శనివారం తెలిపాయి.

సీఆర్‌డీఏ గ్రామాల్లో ఎన్నికలు లేవు

గుంటూరు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే రాజధాని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని మంత్రి నారాయణ కార్యాలయ వర్గాలు శనివారం తెలిపాయి. గతంలో ఉన్న 29 గ్రామాలతో పాటు ఇటీవల సీఆర్‌డీఏ రెండో దశ భూసమీకరణ చేపట్టిన పంచాయతీల్లోనూ ఎన్నికలు జరగవని పేర్కొన్నాయి. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలోని వైకుంఠపురం, కర్లపూడి, లేమల్లె, పెదమద్దూరు, ఎండ్రాయి, చావపాడు, నెమలికల్లు, మండేపూడి, ఉంగుటూరు, ధరణికోట, ముత్తాయపాలెం, లింగాపురం, నరుకుళ్లపాడు, ఎనికేపాడు, అమరావతి, పెదకూరపాడు మండలంలోని బలుసుపాడు, కంభంపాడు, పాటిబండ్ల, తాడికొండ మండలంలోని మోతడక, బండారుపల్లి, గరికపాడు, బేజాతపురం, ముక్కామల, పాములపాడు, కంతేరు, రావెల, పొన్నెకల్లు, దామరపల్లి, ఫణిదరం, తాడికొండ, లచ్చన్నగుడిపూడి, లాం, నిడుముక్కల, మేడికొండూరు మండలంలోని వరగాని, మందపాడు, విశదల, గుండ్లపాలెం, పేరేచర్ల, గుంటూరు తూర్పులోని జొన్నలగడ్డ, గుంటూరు పశ్చిమలోని చినపలకలూరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని తెలియజేశాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 03:24 AM