Share News

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:31 AM

రాష్ట్రంలోని అర్హులందరికీ అక్టోబరు నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు ఇద్దామని టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి లోకేశ్‌ అన్నారు. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముందు సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో లోకేశ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ నిర్వహించారు.

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు

అమరావతి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అర్హులందరికీ అక్టోబరు నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు ఇద్దామని టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి లోకేశ్‌ అన్నారు. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముందు సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో లోకేశ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ నిర్వహించారు. పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ వెళ్దామన్నారు. స్థానిక ఎన్నికలను అక్టోబరులో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారని, అవి వాయిదా పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సెప్టెంబరు 9న మన అధినేతపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా నిర్బంధించి మూడేళ్లు అవుతోందన్నారు. నాటి దుశ్చర్య నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును గుర్తు చేసేలా ఆ రోజు ఓ కార్యక్రమానికి రూపకల్పన చేద్దాం’ అని లోకేశ్‌ చెప్పారు.


ఇవి కూడా చదవండి

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ

పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి

Updated Date - Sep 04 , 2026 | 05:26 AM