ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖైదీ మృతి
ABN , Publish Date - Apr 14 , 2026 | 10:53 AM
నెల్లూరు జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చల్లా లక్ష్మయ్య (31) మృతి చెందాడు. సోమవారం సదరు ఖైదీ స్పృహ కోల్పోయాడు. దీంతో జైలు సిబ్బంది వెంటనే స్పందించి అతడిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు.
నెల్లూరు, ఏప్రిల్14: నెల్లూరు జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చల్లా లక్ష్మయ్య (31) మృతి చెందాడు. సోమవారం సదరు ఖైదీ స్పృహ కోల్పోయాడు. దీంతో జైలు సిబ్బంది వెంటనే స్పందించి అతడిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. మృతుడు గూడూరు మండలం చవటపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు.
పలు కేసుల్లో అతడు నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. ఆయా నేరాలు రుజువు కావడంతో.. కోర్టు అతడికి జైలు శిక్ష విధించిందని చెప్పారు. ఈ శిక్ష అనుభవిస్తూ.. అతడు సోమవారం జైలులో స్పృహ కోల్పోయాడు. లక్ష్మయ్య మృతిపై అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పోస్ట్‌మార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తలుపులు తెరిచి ఉన్నాయి.. వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు: కార్మికులకు మంత్రి సూచన
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు కేసీఆర్ ఘన నివాళి
For More AP News And Telugu News