Share News

ఎన్ని అవాకులు చవాకులు పేలినా తగ్గేది లేదు: వైసీపీ నేతలకు నారాయణ వార్నింగ్

ABN , Publish Date - Sep 15 , 2026 | 07:44 PM

తనను వెనక్కి లాగడానికి ప్రయత్నించినా.. డీ మోరల్ చేయడానికి తనపై ఎన్ని అవాకులు చవాకులు పేలినా తగ్గేది లేదని వైసీపీ నేతలకు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. తన గురించి వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు.

ఎన్ని అవాకులు చవాకులు పేలినా తగ్గేది లేదు: వైసీపీ నేతలకు నారాయణ వార్నింగ్

నెల్లూరు, సెప్టెంబర్ 15: తనను వెనక్కి లాగడానికి ప్రయత్నించినా.. డీ మోరల్ చేయడానికి తనపై ఎన్ని అవాకులు చవాకులు పేలినా తగ్గేది లేదని వైసీపీ నేతలకు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. తన గురించి వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. నెల్లూరులో చెట్లు నాటే మంచి కార్యక్రమంపై కూడా వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. గతంలో కంటే ఇంకా ఎక్కువగా చెట్లు నాటించామన్నారు. గత జగన్ ప్రభుత్వం చెత్తపై ప్రజల నుంచి పన్ను వసూల్ చేసిందని గుర్తు చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా 153 లక్షల టన్నుల చెత్తని వదిలేసిందని వివరించారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను కూడా రద్దు చేసిందని తెలిపారు. తనపై ఎన్ని విమర్శలు చేసినా భయపడేది లేదని పేర్కొన్నారు. ప్రజల కోసం పదింతలు అధికంగా శ్రమిస్తానని చెప్పారు. పొల్యూషన్ లేని నగరాల జాబితాలో నెల్లూరుకు చోటు దక్కిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ అవార్డు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.


అల్లిపురం వద్ద కొండలా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని వివరించారు. అక్కడ మిగిలిన 60 వేల టన్నుల చెత్తను రోజుకు 2 వేల టన్నుల చొప్పున తీయిస్తున్నామని అన్నారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 100 కి.మీల పరిధిలో చెత్త కుప్పలే ఉండవని ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజలకు వివరించారు. నెల్లూరు అభివృద్ధికి దాతలు, కార్పొరేట్ సంస్థల ఉదార సహాయంతో రూ.200 కోట్లు రాబట్టామని మంత్రి నారాయణ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆళ్ల నాని మృతిని తొలుత గుర్తించింది ‘మ్యాక్సీ’నే: వాచ్‌మన్

22A అవకతవకలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరగాలి: కేటీఆర్

For More AP News And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 07:53 PM