ఆగస్టు 4 నుంచి నీట్ కౌన్సెలింగ్
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:43 AM
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ల్లో ప్రవేశాలకు ఈ నెల 4 నుంచి నీట్ యూజీ- 2026 కౌన్సెలింగ్ జరగనుంది. అఖిల భారత కోటా సీట్లకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) శనివారం షెడ్యూల్ విడుదల చేసింది.
అమరావతి/విజయవాడ, ఆంధ్రజ్యోతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ల్లో ప్రవేశాలకు ఈ నెల 4 నుంచి నీట్ యూజీ- 2026 కౌన్సెలింగ్ జరగనుంది. అఖిల భారత కోటా సీట్లకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 4న ప్రారంభమయ్యే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ (రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు)ను నాలుగు విడతల్లో చేపట్టి, ఆయా విడతల్లో కాలేజీల్లో విద్యార్థుల జాయినింగ్‌తో ఆక్టోబరు 10 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఎంసీసీ షెడ్యూల్ ఆధారంగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కూడా రాష్ట్ర కోటా సీట్లకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి కౌన్సెలింగ్‌ను చేపట్టి, విడతల వారీగా అక్టోబరు 10 నాటికి అడ్మిషన్లతో ప్రక్రియను పూర్తి చేసే విధంగా షెడ్యూల్ రూపొందించినట్లు వీసీ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంసీసీ రాష్ట్రాల ప్రభుత్వ కాలేజీల్లోని 15 శాతం అఖిల భారత కోటా సీట్లతో పాటు 100 శాతం డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్‌మెర్ (పుదుచ్చేరి, కారైకాల్) సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేపట్టనుంది. కాగా, తక్కువ సమయంలోనే కౌన్సెలింగ్ ప్రక్రియను సజావుగా, సమయానికి పూర్తి చేయాల్సి ఉన్నందున శని, ఆదివారాలు, ఇతర గెజిటెడ్ సెలవు దినాలను కూడా పని దినాలుగానే పరిగణించాలని ఎంసీసీ అన్ని భాగస్వామ్య కళాశాలలను, సంస్థలను ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిన్నాడు.. భారీ బహుమతి గెలిచాడు..
సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం