హామీ నెరవేర్చిన నారా లోకేశ్.. వడ్డెరల ఆర్థిక పురోగతికి సరికొత్త బాట
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:55 PM
వడ్డెరలకు క్వారీల్లో 33% వాటా ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
అమరావతి, జూన్ 23: వడ్డెరలకు క్వారీల్లో 33% వాటా ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ‘యువగళం పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా చూశా. నాటి పాదయాత్ర సమయంలో తమ కులవృత్తిని కొనసాగించేందుకు క్వారీలు కేటాయించాలని వడ్డెర సోదరులు నన్ను కలిశారు. ఆనాడు నేను ఇచ్చిన హామీ మేరకు క్వారీల్లో 33 శాతం వాటాను వడ్డెరలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నం. 126 జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది’ అని అన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపైట్ల వడ్డెర సంఘాల నేతలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య.. కుమార్తెతోపాటు ఆమె ప్రియుడే నిందితులు..!
పీఎంజే బంగారం షాపు దోపిడీ.. మరో ఇద్దరు దొంగలు అరెస్ట్
For More AP News And Telugu News