ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఏపీ వ్యాప్తంగా ఆశీర్వాద దీపాలు
ABN , Publish Date - Sep 17 , 2026 | 07:53 PM
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఏపీ వ్యాప్తంగా ఇంటింటా ఆశీర్వాద దీపాలు వెలిగిస్తున్నారు. ప్రధాని ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో దేశసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ మంత్రి నారా లోకేశ్ తన నివాసంలో ఆశీర్వాద దీపం వెలిగించారు.
అమరావతి, సెప్టెంబర్ 17: భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ రాత్రి ఏపీ వ్యాప్తంగా ఇంటింటా ఆశీర్వాద దీపాలు వెలిగిస్తున్నారు. ప్రధాని ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో దేశసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ మంత్రి నారా లోకేశ్ తన నివాసంలో ఆశీర్వాద దీపం(AshirwadKaDiya) వెలిగించారు.
ప్రధాని మోదీకి సంపూర్ణ ఆరోగ్యం, బలం, సుదీర్ఘ ఆయుష్షు ప్రసాదించి, ఆయన దేశ సేవను మరింత సమర్థవంతంగా కొనసాగించేలా ఆశీర్వదించాలని కోరుకుంటూ తన నివాసంలో ప్రత్యేకంగా దీపాన్ని వెలిగించినట్లు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భారతదేశం 'వికసిత భారత్' దిశగా అత్యంత ఆత్మవిశ్వాసంతో పయనిస్తోందని లోకేశ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సాధికారత, 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్' అనే సంకల్ప స్ఫూర్తితో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మోదీ నాయకత్వంలో భారతదేశం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News